2013-09-02

శనిగ్రహము


శనిగ్రహమును గురించి కొంత తెలుసుకుందాం .
గ్రహము లన్నిటిలో శనిగ్రహము  చాలా పెద్దది . నెమ్మది స్వభావము కలిగినది . నల్లని రూపము కలది .ఈ గ్రహ స్వరూపము లక్షణములను అనుసరించి మానవుడు చేయు కర్మలు ( వృత్తులు ) ఈ విధముగా ఉంటాయి . ఈ గ్రహము యొక్క ప్రభావము విశ్వం అంతటా వ్యాపించి యుండును . 

మానవుడు జీవించి ఉన్నపుడు , మరణానంతరము కూడా కీర్తిని సంపాదించువారు ఈ గ్రహ ప్రభావము లోనివారే .
శని గ్రహము యొక్క ప్రభావముచే జన్మించిన వారు తాత్కాలిక ప్రయోజనముల కొరకు ఆశించరు . వీరు దీర్ఘకాలిక ప్రయోజనము కొరకు పాటు పడతారు .  సమాజ శ్రేయస్సు కొరకు , దీన జనోద్దరణ కొరకు కృషి చేయుదురు . ఐహిక సుఖములకై తాపత్రయ పడరు . లక్ష్య సాధన కొరకు ఓపిక , సహనముతో ఉంటారు . హక్కుల కొరకు , బానిసత్వ నిర్మూలన కొరకు పోరాడు తత్వము కలిగి ఉందురు . ఆదర్శ పురుషులు ఈ కోవకు చెందిన వారే .

ఉదా : వివేకానందుడు , గాంధీజీ , రామకృష్ణ పరమహంస , లాంటి గొప్ప గొప్ప నాయకులు , సంఘ సంస్కర్తలు మొదలగు వారందరూ ఈ గ్రహము యొక్క అంశ లో పుట్టిన వారే .
     
ఈ గ్రహ ప్రభావము వలన మానవుడు గుంపులకు , సమూహములకు ఆధిపత్యము మరియు నాయకత్వము  వహించును . ఇక్కడ మనము ఒక విషయమును అర్ధం చేసుకోవాలి . సూర్యుడు అధికారమునకు , నాయకత్వమునకు కారకుడు . శని గ్రహము సేనలకు , సేవకులకు కారకుడు .  సూర్యుడు మరియు శనిగ్రహము కాంబినేషన్ లో ఈ రెండు గ్రహముల ఆధిపత్యము బలముగా ఉన్న జాతకులు రాజకీయముల యందు రాణించ గలరు . అనగా ప్రజా సమూహములకు నాయకత్వము వహిస్తారు .

సాధారణముగా ఇటువంటి జాతకులు మొదట సాధారణ జీవితమును ప్రారంభించి అంచెలంచెలుగా ఉన్నత శిఖరముల నదిరోహింతురు . వీరు జీవితమున ఉన్నత ఆశయముల కొరకు పోరాడు చుందురు . పెద్ద పెద్ద బారీ సంస్థలు వీరిచే నిర్మింప బడతాయి . వీరిచే మొదలు పెట్ట బడిన సంస్థలు గానీ , ఉద్యమాలు గానీ ఎంతో కాలం పాటు కొనసాగుతాయి .  స్వంతత్ర ఉద్యమం లాంటివి ఈ కోవలోనివే .

ఇకపోతే ఈ శని గ్రహ అంశయందు పుట్టిన వారు రైల్వేస్ , స్టీల్ ప్లాంట్స్ , ఇనుము , ఉక్కు సంబంధిత పరిశ్రమలలో , గాలికి సంబంధించిన అనగా మొబైల్ పోన్ , సమాచార శాఖలు , పోస్టల్ ,  టెలీఫోన్ , రంగాలలోనూ , రాజకీయాలలోనూ , నూనె పరిశ్రమలు , పెట్రోల్ , డీజిల్ లాంటి ఆయిల్ పరిశ్రమలు ,పరోశోధన రంగములలో ఉన్నత స్థాయి కలిగిన స్థితికి చేరతారు .

 శని గ్రహము నీచ స్థితిలో , శత్రుక్షేత్ర స్థితి లో ఉండి సూర్యునికి 6 8 స్థానములలో ఉన్న జాతకులు సాధారణ జీవనము గడుపుతారు . ఇట్టివారు ఎంత ప్రయత్నించిననూ పైకి రాలేరు . సేవకులుగా , పనివారు గా , కష్ట జీవనము గడుపుచూ బ్రతకడానికి పోరాడుచుందురు . పేదరికమును అనుభవింతురు . సమాజమున గుర్తింపు ఉండదు .      

No comments:

మేషరాశి

ద్వాదశ రాశులను బట్టి మానవుని జీవిత విశేషములను , మానవుల యొక్క గుణ గణాలను తెలుసు కోవచ్చని జ్యోతిష్య శాస్త్రవేత్తలు తెల్పి యున్నారు . మ...