శతభిషా నక్షత్రములో జన్మించిన వారు గంభీరముగా
మాట్లాడుతారు . వీరికి స్వార్ధం ఎక్కువగా ఉంటుంది . ఇతరులలో తప్పులను ఎంచుతారు . తాను చేసిన తప్పులను మాత్రం ఇతరులకు తెలియకుండా జాగ్రత్త
పడతారు. అందరూ తాను చెప్పినట్లే వినాలని
కోరుకొంటారు . గర్వము ఎక్కువ . ఎవరినీ లెక్క చేయరు . కర్కశ మనస్తత్వము కలిగినవారు
. అందువలన అందరూ దూరమవుతారు .
వీరు విద్యావంతులు , మేధావులు , తెలివైనవారుగా
సమాజమున ఉన్నత స్థితి కలిగిన హోదా గౌరవములను పొందుతారు . మనోధైర్యము హెచ్చుగా
ఉంటుంది . ఆర్ధిక పరమైన విషయములలో చాలా ముందు చూపుతో వ్యవహరిస్తారు . బంగారముపై
మోజు ఎక్కువ . ఆభరణములను ధరించుట యందు మక్కువ కలిగి ఉంటారు . వీరు లోతైన మనస్సు
కలిగి ఉంటారు .
కష్ట నష్టములను సమానముగా ఎదుర్కొంటారు . తమ
రహస్యములను ఇతరులకు తెలియనివ్వరు . స్థాయికి మించి ఆలోచన చేయుదురు . గోప్యతను
పాటిస్తారు. బంధువుల పట్ల నిరాదరణ కలిగి ఉందురు. వీరి వ్యవహార శైలి వలన కుటుంబములో
సఖ్యత తక్కువగా ఉంటుంది . కుటుంబ సభ్యుల మధ్య ఆప్యాయతా అనురాగాములకన్నా డబ్బుకే
ఎక్కువ విలువను ఇస్తారు .
ప్రతి విషయము సూక్ష్మముగా పరిశీలించి గానీ నిర్ణయము
నకు రారు . వీరు వేసుకున్న ప్రణాలికలు నెరవేరుట కొరకు ఎంత శ్రమకు అయినా ఓర్చి
సాధించు కొంటారు . ఆచార సంప్రదాయములను పాటిస్తారు . సేవా కార్యక్రమము లలో
పాల్గొంటారు . కానీ అందులో కొంత స్వార్ధం ఉంటుంది . సామాజిక కార్యక్రమములలో
ముందుండి పెద్దరికము వహించాలనీ , అందరూ తమను గౌరవించాలనీ కోరుకొంటారు . ఇతరులు
దగ్గర లోబడి ఉండడం వీరికి ఇష్టం ఉండదు .
తమ భవిష్యత్తు కొరకు ఎక్కువగా ఆలోచన చేయుదురు . స్వయంకృషితో
పైకి వస్తారు . సాధన చేయుదురు. వీరికి పూర్వార్జితము , పిత్రార్జితములు ఉన్ననూ
వాటివలన ఎక్కువగా లాభమును పొందలేరు . స్వార్జితముగా సంపాదించు కొందురు. పిల్లల భవిష్యత్తు కొరకు
ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు . వారిని ప్రయోజకులను చేయుటకు ఎంతో శ్రమ పడతారు . .
No comments:
Post a Comment