2013-09-04

సంక్రమణం



మన మహర్షులు సూర్యుడు మరియు భూమి యొక్క గమనముననుసరించి కాలమును లెక్క వేయుటకు ఒక విధానమును అనుసరించినారు . భూమితన కక్ష్యలోతిరిగే విధమును బట్టి 360 డిగ్రీలుగా 12 రాశులుగా విభజించినారని మనము తెలుసుకొన్నాము. ఈ 12 రాసులనే ద్వాదశ భావములుగా ద్వాదశ లగ్నములుగా చెప్పినారు..
ఇక్కడ మరియొకసారి చెప్పు చున్నాను మొత్తం భూ కక్ష్యను అంతటిని 360 డిగ్రీలుగా విభజించాలి. భూమితనకక్ష్యలో "0" డిగ్రీవద్ద ఉన్నప్పుడు మేషరాశిలో ఉంటుంది. ( సుమారుగా ప్రతిసంవత్సరం ఏప్రిల్ 13,14 తేదిలలో}. దీనినే మనము జాతక చక్రములో సూర్యుడు మేషరాశిలో ఉన్నట్లు చూపిస్తున్నాము.దీనినే మేష సంక్రమణం అనిఅందురు. 

భూమితనకక్ష్యలో సుమారుగా రోజుకొక డిగ్రి చొప్పున తన కక్ష్యలో ముందుకు పోవుచున్నదని తెలుసుకొన్నాం మేష సంక్రమణం జరిగిననాటి నుండి 30 రోజులకు 30, డిగ్రీలను దాటి భూమి 31వ డిగ్రీలో ప్రవేశించును . దీనినే వృషభ సంక్రమణమని అందురు .
60    డిగ్రీలను దాటి భూమి 61వ డిగ్రీలో ప్రవేశించుటను మిధున సంక్రమణ మని
90,   డిగ్రీలను దాటి భూమి 91వ డిగ్రీలో ప్రవేశించుటను కర్కాటక సంక్రమణ మని
120,డిగ్రీలను దాటి భూమి 121వ డిగ్రీలో ప్రవేశించుటను సింహ సంక్రమణ మని
150 డిగ్రీలను దాటి భూమి 151వ డిగ్రీలో ప్రవేశించుటను కన్యా సంక్రమణ మని
180,డిగ్రీలను దాటి భూమి 181వ డిగ్రీలో ప్రవేశించుటను తులా సంక్రమణ మని
210 డిగ్రీలను దాటి భూమి 211వ డిగ్రీలో ప్రవేశించుటను వృశ్చిక  సంక్రమణ మని
240 డిగ్రీలను దాటి భూమి 241వ డిగ్రీలో ప్రవేశించుటను ధను స్సంక్రమణ మని
270 డిగ్రీలను దాటి భూమి 271వ డిగ్రీలో ప్రవేశించుటను మకర  సంక్రమణ మని
300 డిగ్రీలను దాటి భూమి 301వ డిగ్రీలో ప్రవేశించుటను కుంభ  సంక్రమణ మని
330 డిగ్రీలను దాటి భూమి 331వ డిగ్రీలో ప్రవేశించుటను మీన సంక్రమణ మని
ఈవిధముగా ద్వాదశరాశులకు భూమి గమనమును బట్టి ద్వాదశ సంక్రమణ ములను తెలుసుకొనవచ్చు.

No comments:

మేషరాశి

ద్వాదశ రాశులను బట్టి మానవుని జీవిత విశేషములను , మానవుల యొక్క గుణ గణాలను తెలుసు కోవచ్చని జ్యోతిష్య శాస్త్రవేత్తలు తెల్పి యున్నారు . మ...