2013-10-02

సూర్య గ్రహ ఫలితము – పరిష్కారము



మీ జాతకాన్ని మీరే తెలుసుకోండి . . తద్వారా మీకు జీవితములో కలుగుచున్న కష్ట నష్టములకు పరిష్కారములు ఆలోచించండి . హిందూ ధర్మము చెప్పిన రెమిడీ సిద్దాంతము ప్రకారము గ్రహములు దైవ స్వరూపములు . ఒక్కొక్క గ్రహమునకు ఒక్కో దేవుని ఆధిపత్యము కలిగి ఉన్నది .

ఏ గ్రహము యొక్క ప్రభావము వలన ఎలాంటి ప్రభావములు కలుగుతాయి . జరుగుతున్న పరిణామాలను బట్టి  ఏ గ్రహములకు ఏ విధమైన శాంతి చేయాలి . ఏ విధమైన రెమిడీస్ పాటించాలి . అనే విషయమును గురించి తెలుసుకుందాం .

జాతకము లో సూర్య గ్రహము రాహువు లేక కేతువు మరియు పాప గ్రహముల ప్రభావమునకు లోనైతే శారీరక దృడత్వము ఉండదు . శారీరక దుర్బలత్వము కలిగి ఉంటారు . నైసర్గిక పాప గ్రహముల ప్రభావమునకు లోనైనా నీచ గ్రహములతో కలసి ఉన్నా శరీరము దుర్వాసన పుడుతుంది . వీరి దగ్గర ఎవ్వరూ ఉండలేరు . రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది.  వీరు చేపట్టిన వృత్తి లో స్థిరత్వము ఉండదు . చేయు పనులలో అనగా ఉద్యోగము లేక వ్యాపారము ఏదైనా సరే అనేక ఒడుదుడుకులను ఎదుర్కొంటారు . మోస పూరిత స్వభావమును కలిగి ఉండడం గానీ , మోసములకు గురి అవడం గానీ జరుగుతుంది . ఉద్యోగము చేయు వారు నిందలకు గురి అవుతారు . జరిమానాలు శిక్షలు ఎదుర్కొంటారు .

హిందూ ధర్మము ప్రకారము శాంతి చేయాలని అనుకొనే వారు .సూర్యుని ఆరాధించండి . సూర్య అష్టోత్తరమును పటించండి .నవగ్రహ ఆరాధన చెయ్యండి . సూర్య నమస్కారములు చెయ్యాలి . గోధుమ పాయసమును సూర్య భగవానునికి నైవేద్యము పెట్టండి . ఆది వారము రోజు పూర్తిగా శాఖ హారమును మాత్రమే భుజించండి . సూర్యునికి అధి దేవత పరమేశ్వరుడు . ఈశ్వరాధాన చెయ్యండి . రుద్రాభి షేకం చేయించండి .

సైంటిఫిక్ రెమిడీ : శరీరములో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు , దుర్వాసన కలిగిన శరీరము కలవారు . వేకువనే లేచి ఒంటికి బాగా చెమట పట్టేవరకు వ్యాయామము చెయ్యాలి . తదుపరి కాలకృత్యములు తీర్చుకొని స్నానానంతరము ప్రతిరోజూ ఉదయము  6  నుండి 8 గంటల మధ్య తప్పని సరిగా ఎండలో గడపండి. సూర్య కిరణములు ఒంటిని తాకే విధంగా ఉండాలి . వీలయినంత వరకు బాగా పలుచటి దుస్తులను ధరించాలి . దీని వలన శరీరములో రక్త శుద్ది కలుగుతుంది . ఉదయ కాలములో సూర్యుని నుండి వెలువడే లేలేత కిరణాలు శరీరమును తాకుట వలన ఆరోగ్యము మెరుగు పడుతుంది . తేలికగా జీర్ణమయ్యే పదార్ధములను,  ఎక్కువగా ద్రవ పదార్ధములను తీసుకోవాలి . ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తినడం మంచిది .  

No comments:

మేషరాశి

ద్వాదశ రాశులను బట్టి మానవుని జీవిత విశేషములను , మానవుల యొక్క గుణ గణాలను తెలుసు కోవచ్చని జ్యోతిష్య శాస్త్రవేత్తలు తెల్పి యున్నారు . మ...