మనీ మార్కెట్ , ఫైనాన్స్ రంగములకు బుధుడు
ఆధిపత్యము వహించును. అలాగే చంద్రుడు స్థితిని కూడా పరిశీలించాల్సి ఉంటుంది .
షేర్ మార్కెట్ లో కొన్ని వేల కంపెనీల
షేర్లు ఉంటాయి . అన్ని కంపెనీలూ రాణించవు . కొన్ని కంపెనీలలో పెట్టుబడి
పెట్టినపుడు మంచి ప్రతిఫలం వస్తుంది . మరికొన్ని కంపెనీలలో పెట్టుబడి పెడితే అసలు
సొమ్మును కూడా నష్టపోవలసి వస్తుంది. దీనికి కారణం ఏమిటి . ఎవరు ఏ ఏ కంపెనీలలో
పెట్టుబడి పెడితే మంచిది .
జాతకచక్రము ప్రకారము జన్మ లగ్నము నుండి
రెండవ స్థానము ధన స్థానము . ధనము , సంపాదన , రాబడి ఏవిధంగా వస్తుంది, ఏ ఏ వస్తువుల
మూలమున ధన వృద్ది కలుగుతుంది అను విషయములను 2 వ స్థానము నుండి చూడాలి . 2 వ
స్థానము ఏ గ్రహము నకు సంబంధించినది . ఈ స్థానము నందు ఉన్న గ్రహములు , రెండవ
స్థానమును, స్థానాధిపతిని చూస్తున గ్రహములను పరిశీలించి ఆ గ్రహాల మధ్య ఉన్న
సంబంధము తెలుసుకోవాలి . షేర్ మార్కెట్ లో రాణించాలి అంటే బుధుని అనుగ్రహము ఉండాలి
.
గ్రహముల మధ్య ఉండే చతుర్విధ సంబంధము లను
పరిశీలించాలి.
చతుర్విధ సంబంధము అంటే ఏమిటి .
1 ఏ భావము ను గురించి చూస్తున్నామో ఆ
భావమునకు సంబంధించిన గ్రహము , 2 భావము లో ఉన్న గ్రహములు , ౩ భావము ను చూస్తున్న
గ్రహములు భావ అధిపతి తో కలసి ఉన్న గ్రహములు , పరివర్తన యోగములు ఇలా అన్ని విధములా
పరిశీలించాలి .
జన్మ లగ్నము నుండి రెండవ ఇంట ఉన్న
గ్రహములు , రెండవ స్థానమునకు అధిపతి అయిన గ్రహము , రెండవ ఇంటిని చూస్తున్న
గ్రహములు ,వాటి మధ్య ఉన్న సంబంధము ఆధారముగా ఎవరికీ ఏ ఏ కంపెనీల షేర్లు కొంటె లాభం
వస్తుంది . ఎవరెవరు ఏ కంపెనీల షేర్లు కొనాలి ?
అనే విషయమును పరిశీలిద్దాం ?
అన్నిటికి మించి లాభ స్థానమును( 11
స్థానము ) కూడా పరిశీలించాలి . లాభ స్థాన అధిపతి బలంగా ఉంటే సంపూర్ణమైన లాభాలను
అందుకొంటారు . 6 8 12 స్థాన అధిపతులతో సంబంధము కలిగినా చేతికి వచ్చిన లాభాలను
అనుభవించలేరు . ఎందు కంటే లాభం వచ్చినా
గానీ కొందరు షేర్ ధరలు పెరిగినపుడు ఇంకా పెరుగుతాయి అని అమ్మకుండా ఉంటారు . ఈ లోగ పెరగక పోగా పతనం అవుతుంది .
ఎవరికి ఏ ఏ కంపెనీల షేర్లు కొంటె లాభం
వస్తుంది తరువాత శీర్షికలో .........