విజ్ఞానశాస్త్రజ్ఞులు సౌరకుటుంబములో సూర్యుడు నిశ్చలముగా ఉన్నాడని గ్రహములన్ని సూర్యుని చుట్టే తిరుగుచున్నవని చెప్పినారు . కానీ జ్యోతిష్య శాస్త్రవేత్తలు భూమి చుట్టూ గ్రహములన్ని తిరుగుచున్నవని చెప్పినారు. ఈ ఇరువురు వాదనలు వేరుగా ఉన్నవి . అయితే ఫలితములు నిర్ణయించుటకు మాత్రమె భూమిని కేంద్రముగా తీసుకొని ఉంటారు .
ఉదా : ఒక ఖాళీ ప్రదేశమును తీసుకొందాము . ఆ ప్రదేశమునకు దీర్గ వృత్తాకారములో {భూ కక్ష్య } చుట్టూ ఒక గీతను ఏర్పాటుచేద్దాం . వృత్తమునకు మధ్యలో ఒక పిల్లర్ను ఏర్పాటు చేద్దాము . ఇప్పుడు పిల్లరుకు పైభాగములో ఒక పవర్ పుల్ కాంతి కలిగిన లైటును ఏర్పాటు చేద్దాం. దీనినే సూర్యుడు అనుకొందాం. ముందుగా మనము మార్కింగు వేసుకొన్న వృత్తము యొక్క పరిధి అంతా కాంతి ప్రసరించే విధంగా ఏర్పాటు చేద్దాం .
మనము ఏర్పాటు చేసుకొన్న వృత్తాకారము గానున్న గీతను భూ కక్ష్యగా భావించి దీనిని 12 భాగాలుగా విభజించి 12 భాగములకు రాశుల పేర్లు పెట్టుకుందాం. ఇప్పుడు ఒక గ్లోబు తీసుకొని దానికి చుట్టూ అక్షాంశ రేఖాంశములను ఏర్పాటు చేద్దాం . ఈ గీత గుండా ఒక క్రమ పద్దతిలో గ్లోబును పడమర నుండి తూర్పునకు తిరిగేలా ఏర్పాటు చేసుకొంటే గ్లోబుకు ఎదురుగా ఉన్నసగ భాగములో కాంతి పడుతుంది.
దీనినే పగలు అని , కాంతి పడని భాగమును రాత్రి గా తెలుసుకొవచ్చు . మరియు ఈ గ్లోబు తన చుట్టూ తానుతిరుగుటకు 24 గంటలు సమయము పట్టేటట్లు ఏర్పాటు చేస్తే కాంతి తూర్పు భాగములో ఉదయిస్తూ పడమర భాగములో తొలగి పోతూ ఉంటుంది .
ఈ విధముగా భూమిపై వివిధ ప్రాంతములలో ఉన్న ప్రదేశముల మధ్య సూర్యోదయ సూర్యాస్తమయ సమయములలో తేడా వచ్చు చున్నది . ఇప్పటి వరకు చెప్పినది భూమి ఒక రోజులో జరిపే భ్రమణము వలన ఏర్పడే పగలు , రాత్రి , మరియు వివిధ ప్రదేశములలో వచ్చే సూర్యోదయ సుర్యాస్తమయములలో వచ్చే తేడాల గురించి
No comments:
Post a Comment