ఉగాది తెలుగువారి పండుగలలో
విశిష్టమైనది . ఉగాదిని పర్వదినం అని కూడా అంటారు .
ఉగాది అనగా సంవత్సరాది అని అర్ధము (
సంవత్సరానికి ప్రారంభము ) ఈ సంవత్సరములకు ప్రభవ , విభవ , శుక్ల ప్రమోదూత ,
ప్రజోత్పత్తి , అంగీరస ,శ్రీముఖ , భావ , యువ , ధాత, ఈశ్వర , బహుధాన్య , ప్రమోది ,
విక్రమ , వృష , చిత్రభాను , స్వభాను , తారణ , పార్ధివ , వ్యయ , సర్వజిత్తు ,
సర్వధారి , విరోధి , వికృతి , ఖర , నందన , విజయ , జయ , మన్మధ , దుర్ముఖి ,హేవలంబి
, విళంబి, వికారి , శార్వారి, ప్లవ , శుభకృతు, శోభకృతు , క్రోధి , విశ్వావసు, పరాభవ , ప్లవంగ , కీలక , సౌమ్య ,
సాధారణ , విరోధికృతు , పరీధావి , ప్రమోదీశ , ఆనంది , రాక్షస , నల , పింగళ, కాళయుక్తి
, సిద్ధాద్రి , రౌద్రి , దుర్మతి , దుందుభి , రుదిరోద్గారి , రక్తాక్షి , శ్రోధన ,
అక్షయ అని 60 పేర్లు పెట్టారు.
అరవై సంవత్సరములు పూర్తైన తరువాత అవే
తిరిగి వచ్చును .
ప్రస్తుతము 2013 లో విజయ అను పేరు గల
సంవత్సరము నడచుచున్నది .
తిదులను తేదీలు గా ఉపయోగించే కాలములో
చైత్ర శుద్ధ పాడ్యమి రోజు ఉగాది వేడుకలు జరుపు కొనుట ప్రారంభ మైనది . ఉగాది
పర్వదినమున గ్రహములకు చెప్పబడిన రుచులు (ఆరు రుచులు ) కారము , పులుపు , తీపి ,
వగరు , ఉప్పు , చేదు, లను కలిపి ఉగాది పచ్చడి ని తయారు చేసుకొని పండుగ జరుపుకొనే
పధ్ధతి భారత దేశము లో ఆచారముగా ఉన్నది . కొన్ని (యుగాల నుండి) వేల సంవత్సరము లకు
పూర్వమే ఈ సాంప్రదాయము ప్రారంభమైనది.
కాల క్రమేణా భూ గోళము పై ఉన్న అన్ని
దేశముల మధ్య సంబంధము లు ఏర్పడుట వలన
వ్యాపార వ్యవహారము ల కొరకు వివిధ దేశముల మధ్య రాయబారములు నడచుటకు ఇంకా అనేక
విషయము లలో కలసి మెలసి ఉండుట కొరకు ఇప్పుడు మనము అనుసరిస్తున్న ఇంగ్లీషు నెలలు ,
తేదీలు ప్రపంచము అంతా అనుసరించడం వలన పూర్వులు అనుసరించిన తిధులు మరుగున పడిపోయాయి
.
ప్రస్తుత కాలములో డిశంబరు 31 వ తేదీ న నూతన సంవత్సర వేడుకలు జరుపుకొంటున్నారు .ఈ
వేడుకలు జరుపుకొనే విధానము , సమయము లలో తేడా ఉన్నప్పటికీ నూతన సంవత్సర వేడుకలు
జరుపుకొనే పద్ధతిని భారతీయులే ప్రపంచమునకు చాటి చెప్పితిరి .
No comments:
Post a Comment