చంద్రుని గమనమునుబట్టి చంద్రుడు 13.20 డిగ్రీల {చారమును } నడిచేసమయమును నక్షత్రముగా పరిగణించిరని అనుకొన్నాము . అయితే
ఈ సృష్టిలోఉన్న గ్రహములన్నియు ఒకేప్రాంతములో ఒకేకక్ష్యలో లేవు . ఒకగ్రహమునకు
మరొకగ్రహమునకు కొన్నివేల లక్షలకిలోమీటర్ల దూరమున్నది. ప్రతిగ్రహము ఒకదానికొకటి
సంభందము లేకుండా తమతమ కక్ష్యలలో భ్రమణము కలిగియున్నవి . ఆలోచించిచూస్తే అవిసంచరించే నక్షత్రముల సముదాయము ఒక్కటికాదు. కాని గ్రహచక్రములో మనకు జాతకుని జన్మలగ్న
కుండలిని తయారు చేసేటప్పుడు లగ్నము, చంద్రరాశి, రవిరాశి మరియు మిగతా గ్రహములకు కూడా
నవగ్రహముల నక్షత్ర సంచారము వేయుట జరుగుచున్నది. అంతేకాక గ్రహములన్నియు 27 నక్షత్రములలోనే పరిభ్రమించుచున్నవని చెప్పినారు
. . వివిధరకముల వేగముతో వివిధరకముల కక్ష్యలలో నున్న గ్రహములు అనేకనక్షత్ర మండలములలో
కలియుచు సూర్యుని అనుసరించుచున్నవి కదా ? అందువలననే
ఇప్పుడు మనముచూస్తున్న నక్షత్రములకు జ్యోతిర్విదులు చెప్పిన నక్షత్రములకు పొంతన
కుదురుటలేదు . .మరి ఈనవగ్రహముల నక్షత్ర సంచారము జన్మకుండలిని వేసే విధానమును
బట్టి పరిశిలిస్తే అర్ధమయ్యే విషయమేమిటంటే ., సమస్త మైన ఈ నవగ్రహమండలమును 27
నక్షత్రమండలములుగా విభజించినారని తెలియుచున్నది. మరియు ఒక్కొక్క నక్షత్రమండలమునకు
ఒక్కొక్క నక్షత్రనామమును సూచించినారు. గ్రహము సంచరించే ప్రాంతమును ప్లేస్ ను మనము
డిగ్రీలలో సైంటిఫిక్ గా అంచనా వేయుచున్నాము . అయితే సామాన్యునికి అర్ధమయ్యే విధంగా
ఉండుటకు మనమహర్షులు ఈ విధమైన నక్షత్రవిధానమును ఎన్నుకొనిఉండవచ్చును .
Subscribe to:
Post Comments (Atom)
మేషరాశి
ద్వాదశ రాశులను బట్టి మానవుని జీవిత విశేషములను , మానవుల యొక్క గుణ గణాలను తెలుసు కోవచ్చని జ్యోతిష్య శాస్త్రవేత్తలు తెల్పి యున్నారు . మ...
-
ఉత్తరాభాద్ర నక్షత్రములో పుట్టిన పిల్లల పేర్లు జన్మనక్షత్రము నక్షత్రపాదము అబ్బాయి అమ్మాయి ఉత్తరాభాద్ర 1 ...
-
జన్మనక్షత్రము నక్షత్ర పాదము అబ్బాయి అమ్మాయి చిత్త 1 ప్రేమ్ కుమార్ Premkumar ప్రేమ ...
-
పుబ్బ , ఉత్తర నక్షత్రములలో పుట్టినవారి పేర్లు పుబ్బనక్షత్రములో పుట్టిన వారికి పేర్లు జన్మనక్షత్రము నక్షత్ర పాదము అబ్బాయి అ...
No comments:
Post a Comment