భూమి సూర్యుని చుట్టి వచ్చుటకు 364.75 రోజులు పట్టుచున్నది . ఈ సంవత్సర కాలమును ౩ భాగములుగా విభజించ బడినది . 1 వేసవికాలము 2
వర్షాకాలము ౩ శీతాకాలము
జూన్21 వ తేది సమయములో
కర్కాటకరేఖపైన సూర్యకిరణములు ఉచ్చముగా ఉండుట వలన భూమి ఉత్తరార్ధ గోళమున వేసవిగాను
దక్షిణార్ధ గోళమున శీతాకాలము డిశంబరు 22 వ
తేది సమయములో మకరరేఖపై సూర్యకిరణములు ఉచ్చముగా ఉండుట వలన దక్షిణార్ధ
గోళమున వేసవిగాను ఉత్తరార్ధ గోళమున శీతాకలము ఏర్పడుచున్నవి .
భ చక్రము 360డిగ్రీలు అనుకొన్నప్పుడు మొత్తం 12 రాశులు. ఒక్కొక్క
రాశిని ౩౦ డిగ్రీలుగా చేసి వాటికి మన మహర్షులు పేర్లు పెట్టారు . అవి మేషము , వృషభము, మిధునము , కర్కాటకము , సింహము ,
కన్య , తుల, వృశ్చికము , ధనుస్సు , మకరము , కుంభము , మీనం.
భారత దేశములో జనవరి 14 న సూర్యుడు
మకరరాశిలో ప్రవేశించు సమయ మకర సంక్రమణమని
ఈసమయమునే ఉత్తరాయణ పుణ్యకాల మనియు అందురు . సూర్యుడు రాశి ప్రవేశము జరుగుట కాదు.
భూమి తన కక్ష్యలో 27౦వ డిగ్రీ నుండి 90 వ డిగ్రి వరకు ఉత్తరమునుండి దక్షిణదిశగా
వెళ్ళుచున్నది . ఈకాలములో ఆకా ములో సూర్యుడు దక్షిణము నుండి ప్రతి రోజు కొంత భాగము
ఉత్తరమునకు వెళ్ళు చున్నట్లు కనబడును . దీనినే ఉత్తరాయణ పుణ్యకాలమని అందురు .
అదే విధంగా జులై14 కర్కాటక రాశిలో భూమి 90 వ డిగ్రీలో ప్రవేసిస్తుంది .దీనిని
దక్షిణాయన మనియు దక్షిణాయన పుణ్య కాలమనియు అందురు . ఈ కాలములో సూర్యుడు
ఆకాశములోఉత్తరమునుండి దక్షిణ దిశకు వెళ్లినట్లు కనబడును . ఈ విధంగా సంవత్సరమునకు
రెండు ఆయనములు ఏర్పడుచున్నవి.
No comments:
Post a Comment