రుద్రాక్షలు – ఫలితములు
భారత దేశములో రుద్రాక్షలను
ధరించుట అనాదిగా ఉన్నది . పూర్వకాలము నుండి
మునులు, మహర్షులు రుద్రాక్షలను
ధరించడం గురించి పురాణము ల ద్వారా తెలియు చున్నది .
రుద్రుని ( శివుని కన్నుల )
యొక్క అక్షము నుండి పుట్టినది గాన దీనికి రుద్రాక్ష అని పేరు వచ్చింది . మనకు
లభించు చున్న రుద్రాక్షలలో ఏకముఖి నుండి మొదలుకొని అనేక ముఖములు గల రుద్రాక్షలు
ఉంటున్నాయి .
రుద్రాక్ష శివుని స్వరూపము
. ముఖ్యముగా శివుని ఆరాధకులు , శివ భక్తులు రుద్రాక్ష ను ధరించుట మంచిది . అంతే
కాకుండా రుద్రాక్షను ధరించుట వలన సకల పాపాలు నశిస్తాయి . భగవత్ అనుగ్రహము తొందరగా
కలుగుతుంది .
ఏ ముఖము కలిగిన రుద్రాక్ష
ఎలాంటి ఫలితమును ఇస్తుంది . అనే విషయమును తెలుసుకుందాం .
ముఖము
|
స్వరూపము
|
ఫలితము
|
ఏక ముఖి
|
శివ స్వరూపము
|
బ్రహ్మ హత్యా దోషము తొలగును
|
ద్వి ముఖి
|
పార్వతి పరమేశ్వరులు
|
గోవధాది దోషము పోవును
|
త్రి ముఖి
|
అగ్ని స్వరూపము
|
జన్మాతః పాపములు నశించును
|
చతుర్ముఖి
|
బ్రహ్మ స్వరూపము
|
నరహత్యా పాపము తొలగును
|
పంచ ముఖి
|
కాలాగ్ని రూపము
|
వెడలని పాపము నశించును
|
షణ్ముఖి
|
గుహుని స్వరూపము
|
భ్రూణ హత్యాది పాపము పోవును
|
సప్త ముఖి
|
అనంత రూపము
|
దొంగతనము చేసిన పాపములు
|
అష్ట ముఖి
|
వినాయక రూపము
|
అసత్యము వలన కలిగిన పాపములు
|
నవ ముఖి
|
భైరవ రూపము
|
శివ సన్నిధికి చేర్చును
|
దశ ముఖి
|
విష్ణు స్వరూపము
|
భూత , ప్రేత , పిశాచ భాధలు నశించును
|
ఏకాదశ ముఖి
|
రుద్రా స్వరూపము
|
యజ్ఞా ఫలము కలుగును
|
ద్వాదశ ముఖి
|
సూర్య స్వూపము
|
సమస్త రోగములు నశించును
|
త్రయోదశముఖి
|
లక్ష్మీ స్వరూపము
|
సమస్త కోరికలు తీరును
|
చతుర్దశ ముఖి
|
శ్రీకంట స్వరూపము
|
సత్ సంతానము కలుగును
|
No comments:
Post a Comment