2017-08-07

నిషిధ్ధ నవమీ త్రయం

 నిశిధ్ధ నవమి అంటే ఎమిటి ?
నిషిద్ధము అంటే విడచి పెట్టబడునది అని అర్ధము .
నవమీ త్రయము అనగా ఎదైనా ఒక తిధి నుండి తొమ్మిదవ తిధి , ఒకనక్షత్రము నుండి తొమ్మిదవ నక్షత్రము , ఒక రోజు నుండి తొమ్మిదవ రోజు వీటినే నవమీ త్రయము అని అంటారు.

ముఖ్యమైన పనులకొరకు , వివాహాది సంబంధములుకు ప్రయాణమై వెళ్ళునపుడు, కొత్త పెల్లి కూతురు, గర్భవతిగా ఉన్నప్పుడు, అలాగే చంటి బిడ్డతో తొలిసారి అత్తవారింటికి వెళ్ళునపుడు, తిరిగి ప్రయానము చేయాల్సి ఉంటే అలాంటి సమయములో పైన తెలిపిన విషయములను తప్పక పాటించాలి.


ప్రయాణమై బయలుదేరిన తిధి నుండి తొమ్మిదవ తిధి, బయలు దేరిన రోజునుండి తొమ్మిదవ రోజు, బయలుదేరిన నక్షత్రము నుండి తొమ్మిదవ నక్షత్రమున తిరుగు ప్రయాణము చెయ్యకూడదు. దీనినే నిషిద్ద నవమీ త్రయము అని అందురు. అట్లు చేయుట వలన అశుభము కలుగును.

No comments:

మేషరాశి

ద్వాదశ రాశులను బట్టి మానవుని జీవిత విశేషములను , మానవుల యొక్క గుణ గణాలను తెలుసు కోవచ్చని జ్యోతిష్య శాస్త్రవేత్తలు తెల్పి యున్నారు . మ...