చంద్రునికి వృషభరాశి
ఉచ్చారాశి . మిత్ర క్షేత్రముల యందును , శుభ క్షేత్రములలోనూ మంచి ఫలితములను ఇచ్చును
. జూన్ 20 నుండి జూలై 27 తేదీల మధ్య విశేష బలము కలిగి ఉంటాడు . ఈ తేదీల మధ్య
జన్మించిన వారికి చంద్రుని వలన విశేషమైన యోగము కలుగును .2 , 11 , 20 , 29 తేదీలలో
పుట్టిన వారికి చంద్రుడే అధిపతి .
ఈ Moon స్వభావము వలన వీరు చపలచిత్తులు, స్థిరత్వం తక్కువ . గొప్ప ఆలోచనా శక్తిని
కలిగి ఉంటారు . కళల యందు అభిమానము అధికము .
భోగముల యందు ఆసక్తి , ప్రేమ , దయ
వీరిలో అధికముగా ఉంటుంది . మంచి ప్రవర్తన కలిగి ఉంటారు . సదా సంచార ప్రియులు .విలాసములకు
అధికముగా ఖర్చు పెడతారు . దైవము పట్ల నమ్మకము ఎక్కువ . వీరికి దైవశక్తి తోడుంటుంది
. బుద్ది కుశలత కలవారు . తక్కువ పెట్టుబడితో ఎక్కువ ప్రతి ఫలాన్ని ఆశిస్తారు .
ప్రతి పనిని
పూర్తిగా చేయరు . మధ్యలో విడచి పెడతారు . వీరికి ఆరంభ శూరత్వము ఎక్కువ . పని
ప్రారంభించినపుడు ఉన్న పట్టుదల తరువాత ఉండదు . క్రమేపీ తగ్గి పోతుంది ఇరుగు పొరుగు వారితో , మరియు ఇతరులతో మంచి సంబంధములు ఏర్పాటు చేసుకొందురు .
వీరికి ప్రతి నెలలోనూ 2 , 11 , 20 , 29 తేదీలు అనుకూలముగా ఉంటాయి . ఈ తేదీలలో
కొత్త పనులు , వ్యాపారాలు ప్రారంభించిన మేలు కలుగును . ఆది సోమ శుక్ర వారములు కలసి
వచ్చును .
వీరికి విశ్రాంతి
ఉండదు . ఎప్పుడూ ఏదో ఒకటి ఆలోచిస్తూ ఏదో ఒక పనిలో నిమగ్నులై ఉంటారు . Life Partner వలన Property కలసి వచ్చును .
వీరిది తెలియని సంపాదన . ఒకప్పుడు ఉన్నత స్థితికి చేరుకుంటారు . మరలా అదోగతికి
పొందే అవకాశము ఉంటుంది ,. ఈ సమయములో చాలా జాగ్రత్త అవసరము . వీరికి కోపము
వచ్చిందంటే మంచి చెడు అని తేడా చూడరు . తన కోపమే తన శత్రువు అను విధంగా వీరి కోపము
వలన Loses ఏర్పడతాయి .అభిమాన వంతులు . వయసు పెరిగే కొద్ది
బుద్ది సూక్ష్మత పెరుగును .
వీరికి అనుమానము
ఎక్కువ . ఏ విషయమును తొందరగా నమ్మరు . 1 వ
తేదీన జన్మించిన వారితో స్నేహము చేయుట వలన వారు వీరికి మార్గ నిర్దేశనము చేయుటకు
ఉపయోగ పడతారు . మంచి సలహాలను ఇచ్చి ప్రోత్సహించ గలరు . వీరికి వ్యభిచార లక్షణములు
ఉండే అవకాశములు ఉన్నవి . రహస్యమైన పనులు చేయుదురు .శుచి శుభ్రత, మంచి వస్త్ర ధారణ
వీరికి ఇష్టము . మనో నిగ్రహము చాలా తక్కువ . ఊహల్లో విహరిస్తూ ఉంటారు . విద్య
సామాన్యము . అధిక మేధాశక్తి కలిగి ఉందురు . వీరు దాంపత్య జీవితములో చిన్న చిన్న
సమస్యలు ఏర్పడినప్పటికీ సర్దుకు పోతారు .వైవాహిక జీవితము సుఖప్రదంగా ఉంటుంది .
భార్య భర్త ఇరువురు 2 వ సంఖ్యకు సంబంధించిన వారై ఉంటే మొండిగా ప్రవర్తిస్తారు .
వీరికి Red , Black , Rose Colors
పనికి రావు .
White, Green Favorable Colors
Moon Stone , Emerald and
Green is favorable stones
11 , 14 , 20 , 23, 32 , 35 , 41, 44 , 53 , 62 71 సంవత్సరములు అనుకూలమైనవి .
14th లో విద్యాభివృద్ది , 23rd year Life settlement
44th year Gain Property , Lands , House. Gold Etc......
No comments:
Post a Comment