2013-12-10

Number 3


3 వ సంఖ్య గురుడు  Jupiter : బ్రహ్మ విష్ణు మహేశ్వరులు . సృష్టి , స్థితి లయలు Past , Present and future , సత్వ రజస్ తమో గుణములు ఇవన్ని మూడవ Number లో ఇమిడి ఉన్నవి . వీటికి Jupiter బృహస్పతి అధిపతి అయి ఉన్నాడు . 3 , 12 , 21 , 30 తేదీలలో పుట్టిన వారికి Lucky Number ౩ వీరిపై గురు గ్రహము యొక్క అనుగ్రహము ఉంటుంది .

Horoscope ప్రకారము కర్కాటక రాశిలో గురుడు స్థితి పొంది ఉన్నప్పుడు జన్మించిన వారిపై  ఇతడు బలము కలిగి ఉండును. మిత్ర క్షేత్రములలో , కోణముల యందు బలమైన వాడు . చేతి యందు Index Finger క్రింది భాగము గురుస్థానము . ఇది ఎత్తుగా ఉబ్బెత్తుగా ఉన్నవారు సుఖముగా ఆనందమైన జీవనము సాగింతురు . జ్ఞానము కలవారు . మంచి హోదా గౌరవ ప్రదమైన హుందా కలిగిన జీవితమును సాగింతురు .

ముఖము నందు దైవత్వము ఉండును . అన్యాయపు పనులు చేయరు . మనోబలం , బుద్ది బలము కలవారు , వీరు సలహాదారులుగా, Teachers , Speakes, Astrologers మరియు మతభోధకులు , ప్రచార కర్తలుగా స్థిర పడతారు . స్వతంత్ర ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి . స్వతంత్ర జీవనము గడుపుటకు ఇష్ట పడతారు . మంచి బుద్ది కుశలత కలవారు . వీరు గౌరవము అధికారము కల ఉద్యోగములలో స్థిరపడతారు . అట్లు గాకున్న ఉన్నత స్థితి కలిగిన పదవులను అధిరోహిస్తారు . దైవ చింతన కలవారు . గొప్ప గొప్ప వాళ్ళతో Friendship చేస్తారు .
House Property , Land Property కలిగి ఉంటారు. వీరికి కనక పుష్య రాగము Lucky Stone దీనిని ఉంగరములో చేయించి ధరించిన అన్ని విధముల అనుకూలించును .

Favorable Days : Sunday, Saturday, Monday
Favorable Dates : 3 ,12, 21, 30, and  1, 2 , 7 పైన తెలిపిన తేదీలలో ఆ వారములు కలసి వచ్చిన రోజులు వీరికి అత్యంత అనుకూలమైనవి .సంవత్సర సంఖ్యను కలుపగా 1, 2, 4, 7, 8వచ్చిన సంఖ్యలు వీరికి చాలా అనుకూలముగా ఉంటాయి .ఉదా : రాబోయే సంవత్సరము 2014 మొత్తం సమిష్టి సంఖ్య  7 అవుతుంది . ఈ సంఖ్య చాలా అనుకూలతను కలిగిస్తుంది . ఇలాంటి అనుకూల సంఖ్యలు వచ్చిన సంవత్సరములలో ఉద్యోగము నందు ప్రమోషన్స్ ,గొప్ప వాళ్ళ పరిచయాలు , వివాహాది శుభ కార్యములు జరగడం , వ్యాపార రంగములో ఉన్నవారికి అభివృద్ధి మొదలగునవి జరుగును .

 వీరు సంపాదిస్తారు . మంచి ఆదాయము కలిగి ఉంటారు . కానీ ఎంత ఆదాయము వస్తుందో ఖర్చులు కూడా అలాగే ఉంటాయి . ధనమును నిల్వ చేయలేరు .అన్యాయాన్ని సహించలేరు . కోపము అధికము . నీతి నిజాయితీ కలిగి ఉత్తమ భావాలను కలిగి ఉంటారు. వీరు చూడటానికి అమాయకముగా కన్పిస్తారు . కానీ బహు గడసరులు వయసు గడిచే కొలది సుఖ పడతారు . మాతృసౌఖ్యం , సోదర సౌఖ్యం కలిగి ఉందురు. కానీ అన్యోన్యత తక్కువ . వంశాచారాలు , ఆచార సంప్రదాయాలకు విలువ ఇస్తారు వీరికి సాధారణ ఆరోగ్యము ఉంటుంది . కానీ మనసు మాత్రము ధృడంగా ఉంటుంది .
12, 15 , 21 , 27 , 30 , 33 , 36 , 39 , 42 , 46 , 49 , 54 , 60 , 63 , సంవత్సరములు కలసి వస్తాయి.     

No comments:

మేషరాశి

ద్వాదశ రాశులను బట్టి మానవుని జీవిత విశేషములను , మానవుల యొక్క గుణ గణాలను తెలుసు కోవచ్చని జ్యోతిష్య శాస్త్రవేత్తలు తెల్పి యున్నారు . మ...