2013-12-12

Number 4


4 వ సంఖ్య రాహువు Rahuvu  : నాలుగు దిక్కులు , నాలుగు వేదాలు , ధర్మ అర్ధ కామ మోక్షాలు , సామ దాన భేద దండోపాయములు, బాల్యము , కౌమారము , యవ్వనము , వృద్ధాప్యము ఇలా ఉన్నవన్నీ నాలుగు సంఖ్య ఆధీనములో ఉంటాయి . వీటికి రాహు గ్రహము ఆధిపత్యము వహించును . పైన తెలిపిన వాటన్నింటికి రాహువే ఆధార భూతుడై ఉంటాడు .

 ఈ రాహువు ఉచ్చ మిత్ర క్షేత్రముల యందు , జాతక రీత్యా ౩  , 6 స్థానములలో ఉన్నప్పుడు బలవంతుడు . మరియు 4 , 1౩ , 22 , ౩1 తేదీలలో పుట్టిన వారందరూ 4 వ సంఖ్యకు చెందినవారు . ఈ 4 వ సంఖ్యకు చెందినవారు ఇతరులతో ఏకీభవించక వ్యతిరేఖ ప్రవర్తన కలిగి ఉంటారు .శాంతము , సహనము వీరికి తక్కువగా ఉంటుంది . శత్రువులు అధికముగా ఉంటారు .

ఉద్రేక స్వభావము కలిగి ఉందురు . వృధాగా కాలమును గడిపేస్తారు . స్త్రీ వ్యామోహం ఎక్కువ . ధీమా , అహంకారము , కోపం ఎక్కువగా ఉంటుంది . ఎవరికీ లొంగరు . మొండివారు . దృడత్వము కలవారు . తగినంత ఎత్తు కలిగి ఉందురు . విశాలమైన నుదురు , మంచి కనుబొమ్మలు కలిగి ఉంటారు . వీరి బాల్యమున అనేక కష్టములను ఎదుర్కొందురు. యవ్వనము లోకి ప్రవేశించే సమయము నుండి లౌకిక జ్ఞానము , మంచి చెడు భేదాభిప్రాయములను తెలుసుకొని నడచు కొందురు . కానీ పాత సంప్రదాయములను , ఆచార వ్యవహారములను నమ్మరు . వాటిని వ్యతిరేకిన్తురు . సంఘములో అనేక మార్పులు తేవాలని చూతురు . సంఘాన్ని ఉద్ధరించడానికి పుట్టామనే గొప్పలు చెప్పుకుంటారు .

English భాషలో మంచి పట్టు సాధిస్తారు . పొరిగింటి పుల్లకూర రుచి అన్నట్లు తాము పుట్టి పెరిగిన ప్రదేశములలో ఉన్న ఆచారములు , సంప్రదాయముల కన్నా విదేశీ అలవాట్లు , పద్దతులపై మోజు ఎక్కువ . వీరిలో ఎక్కువ మంది ప్రేమికులు లేక Love Marriage చేసుకునే వారే ఉంటారు .కానీ వైవాహిక జీవితము కొంత వరకు అస్తవ్యస్తం గా ఉంటుంది. భార్యాభర్త మధ్య ఎడబాటు రావడమో లేదా ఇరువురులో ఎవరో ఒకరికి అనారోగ్యము కలగడమో జరుగుతుంది . తద్వారా దాంపత్య జీవితము కొంత అసంతృప్తిగా ఉంటుంది . ఆకస్మిక ధనలాభం కలుగును .

ఈ రాహువు Horoscope ప్రకారము జన్మ లగ్నము నుండి 1 లేక 7 స్థానములో ఉన్నప్పుడు విధవా సంపర్కము గానీ లేక అన్య జాతికి చెందిన వారితో గానీ వివాహము జరుగును . అట్లు లేని యెడల అక్రమ సంబంధములు కలిగి ఉంటారు. వీరికి June 21 to July 27 Dates మధ్య అనుకూలముగా ఉంటుంది .విద్యాభ్యాస సమయములో కొంత ఒడుదుడుకులు కలుగును . మొండిగా వ్యవహరించుట మంచిది కాదు . 31 Years నుండి యోగదశ ప్రారంభమగును . డబ్బును వృధాగా ఖర్చు చేసే అలవాటు ఉంటుంది . Prestige Issue తో Waste ఖర్చు పెడతారు . 1 2 7 8 సంఖ్యలు గల వారితో మంచి ఆదరాభిమానాలు , నమ్మకముతో ఉంటారు .

ధన సంపాదన యందు మెళకువలు తెలిసినవారు . ఏకధాటిగా ఎంతసేపయినా ఉపన్యాసము చేయగలరు . వాగ్దాటి బాగుంటుంది . కన్న తల్లిదండ్రుల కన్నా అత్తవారు వారి తరపు బంధువుల యెడల మర్యాదను ప్రదర్శిస్తారు .

1 4 10 13 19 22 26 31 35 37 40 44 46 49 53 55 58 62 64 73 సంవత్సరములు వీరికి అనుకూలమైనవి .
18 19 22 25 28 37 40 44 సంవత్సరము లలో జీవితమున అనుకోని మార్పులు కలిగి ఉన్నత అభివృద్ధి , లాభములు కలుగును .     

No comments:

మేషరాశి

ద్వాదశ రాశులను బట్టి మానవుని జీవిత విశేషములను , మానవుల యొక్క గుణ గణాలను తెలుసు కోవచ్చని జ్యోతిష్య శాస్త్రవేత్తలు తెల్పి యున్నారు . మ...