ఈ 5 వ సంఖ్యకు చెందినవారు ఏ ఇంట జన్మించిన వారైనా సరే పుట్టుకతోనే వ్యాపార లక్షణములు కలిగి ఉంటారు .5 , 14 , 23 తేదీలలో జన్మించిన వారు జనవరి 10 నుండి జూలై 1౩ తేదీల మధ్య పుట్టిన వారిపై బుధ గ్రహ ప్రభావము ఎక్కువగా ఉంటుంది .
వీరు మంచి
ఆరోగ్యవంతులు . బుధుడు మే 21 నుండి సెప్టెంబర్ 27 తేదీల మధ్య విశేష బలము కలిగి
ఉండును . ఈ మధ్య కాలములో 5 14 23 తేదీలలో జన్మించిన వారికి మంచి యోగమును ప్రసాదించ
గలడు . వీరికి స్థిరత్వము తక్కువ . ప్రయాణము అంటే ఇష్టము . అందరితో కలసి మెలసి
ఉంటారు . ఎదుటి వారి మనసు గుర్తెరిగి మసలుకుంటారు . ఇతరులను అతి సులభంగా వశపరచు
కొందురు . మంచి బుద్ది కుశలత గలవారు . హాస్య సంభాషణ చతురులు .వీరు సామాన్య ఎత్తు
కలిగి మధ్యమంగా ఉంటారు . బుధ శుక్రవారాలు కలసి వస్తాయి . బుధవారము అధికముగా
అనుకూలిస్తుంది .వీరు ఇతరుల చేతిలో తొందరగా మోసపోవుదురు . వీరికి రెండు మూడు
రకాలుగా ధన సంపాదన కలిగి ఉందురు
స్వయంకృషితో
అభివృద్ది లోకి వస్తారు . వీరి జీవితమున అనేక మార్పులు సంభవించును. కోరికలు ఎక్కువ వ్యాపార వ్యవహారములను చాలా
నేర్పుగా చక్కబెట్టగలరు . మోసములు , దగా చేయు వారిని దరి చేరకుండా జాగ్రత్త
పడవలెను . 14 28 32 41 50 62 71 సంవత్సరములు చాలా అనుకూలముగా ఉండును . 23 సంవత్సరములో
స్థిరత్వము కలుగును . 35 వ సంవత్సరము మంచి స్థానము , Promotion , లభించును . బూడిద రంగు వీరికి Lucky
Color . మెరిసే వస్తువులు
ధరించుట మంచిది . Diamond , తెలుపు రంగు రాళ్ళు ధరించిన మేలు కలుగును . Silver ( వెండి ) వస్తువులు వాడటం మంచిది . వెండి కంచములో భుజించడం వలన చాలా లాభాలు
ఉంటాయి .దీనివలన నరముల బలహీనత , శరీర దుర్బలత్వము కలుగదు . ఆరోగ్యము మెరుగు
పడుతుంది .
వంశ పారంపర్య
గుణాలు వీరిలో ఉంటాయి .స్వార్జితముగా ధనమును కూడపెడతారు . వీరిలో చాలా మందికి
తక్కువ వయసులోనే వివాహము జరుగుతుంది . విద్య పట్ల మమకారము ఎక్కువ . విద్యాధికులు ,
చదువుకున్న వారిపట్ల గౌరవమును ప్రదర్శింతురు . తీర్ధ యాత్రలు చేయుట వీరికి ఇష్టము
.చిరకాలము పేరు ప్రఖ్యాతలు కలిగి ఉంటారు .
No comments:
Post a Comment