2013-12-15

Number 6

6 వ సంఖ్య Venus శుక్రుడు : ఆరు ఋతువులు , షట్కర్మలు , షడ్గుణములు , షడ్చాస్త్రములు , షడ్రసములు , షడ్రుచులు , షడైశ్వర్యములు మొదలగు వాటికి కారకుడైన శుక్రుడు 6 వ సంఖ్యకు అధిపతి .ఇతడు బ్రాహ్మణ గ్రహము మరియు స్త్రీ గ్రహము .శుభుడు , కళత్ర అధిపతి .6 15 24 తేదీలలో పుట్టిన వారు మరియు ఏప్రియల్ 20 నుండి మే 20 తేదీలలోపల , సెప్టెంబరు 11 నుండి అక్టోబర్ 27 తేదీల లోపల జన్మించిన వారు 6 వ సంఖ్యా ప్రభావములో ఉంటారు . వీరిపై శుక్ర గ్రహ ప్రభావము అధికముగా ఉంటుంది .

ఇందు జన్మించిన వారు సంగీత , సరస సల్లాపములు , వాహనములు , భోగములు , స్త్రీ సౌఖ్యము , శయ్యా సౌఖ్యములు కలిగి ఉంటారు .ప్రతి ఫలాపేక్ష లేకుండా ఇతరులకు సహాయ పడతారు .ప్రేమ వ్యవహారములలో జయము కలుగును . నిశితమైన చూపును కలిగి ఇతరులను ఇట్టే ఆకర్షించగల రూపము కలిగి ఉందురు .అలసట , నీరసను , నరముల బలహీనత , మేహ వ్యాధుల వంటి అనారోగ్యము కలిగి ఉందురు .

వీరికి తమ స్వస్థలము నుండి పడమట నైరుతి దిశలలో ప్రయాణించుట , ఆయా ప్రాంతములకు వలస పోవుట వలన లాభమును పొందుతారు . వ్యాపారస్తులు మరియు ఉద్యోగస్తులు కౌంటరు నందు పడమట దిశను చూస్తూ కూర్చుని పనిచేసిన వృత్తి యందు వృద్ధి కలుగును .లక్ష్మి దేవిని , దుర్గా మాతను పూజించుట , సహస్ర నామ పారాయణము చేయుట వలన మేలు కలుగును. 

ఆత్మస్తుతి పనికిరాదు .బందువులు మరియు స్నేహితులతో సత్సంబంధములు కలిగి ఉంటారు .వీరు హుందాగా , దర్పంగా , గంబీరమైన మనస్సు కలిగి ఉందురు .కల్మషము లేని హృదయము కలవారు . 15  24 ౩౩ సంవత్సరములలో విద్యాభి వృద్ది కలుగును ౩౩ సంవత్సరము యోగదశ ప్రారంభము అవుతుంది .స్థిరాస్తి వృద్ధి చెందును . సకల శోభితమైన గృహము ప్రాప్తించును. అందమును ఆస్వాదింతురు . 

42 సంవత్సరములో గౌరవము పెరగడము , అధికారము తో కూడిన పదవిని పొందడము జరుగుతుంది . 38 వ సంవత్సరములో ముఖ్యమైన మార్పులు కలుగును . మంగళ , గురు శుక్ర వారములు కలసి వస్తాయి . వంశ పారంపర్య ఆస్తులే కాకుండా స్వార్జితపు ఆస్తులు కూడా బాగా సంపాదిస్తారు .


సంతాన విషయములో వారి బాగోగుల విషయములో క్రమ శిక్షణతో కూడిన పద్దతులను అవలబించాలి . లేని యెడల సంతానము వలన కొన్ని ఇబ్బందులు ఎదురుకాగలవు.  వీరి మనస్సు క్షణికావేశం నకు లోను కాగలదు . తద్వారా Illegal Contacts , Bad Habits కు తొందరగా అలవాటు పడతారు . జాగ్రత్త అవసరము . ప్రతి నెలలోనూ 12 15 18 21 24 27 30 3 6 9 And 6 15 24 తేదీలు అనుకూలముగా యోగ ప్రదంగా ఉంటాయి .       

No comments:

మేషరాశి

ద్వాదశ రాశులను బట్టి మానవుని జీవిత విశేషములను , మానవుల యొక్క గుణ గణాలను తెలుసు కోవచ్చని జ్యోతిష్య శాస్త్రవేత్తలు తెల్పి యున్నారు . మ...