2013-12-25

Number 7

7 వ సంఖ్య కేతువు : సప్త ఋషులు , సప్త సముద్రములు , ఏడు ఖండాలు , సప్త ద్వీపములు  మొదలగు వాటికి కారకత్వము వహించునది 7 వ సంఖ్య.  దీనికి  అధిపతి . కేతువు . ఈ కేతువు చంద్రునికి సంబంధించినదిగా తెలుసుకోవాలి . 2 7 Negative and Positive  ఈ రెండు ఫలితాలను కలుగ చేయును . 

 7 16 25 తేదీలలో పుట్టిన వారి కి కేతువు అను గ్రహము ఆధిపత్యము వహించును . వీరు 7 వ సంఖ్యకు చెందినవారు. వీరు గొప్ప గొప్ప ఆశయములను పెట్టుకొని బ్రతుకుతూ ఉంటారు .సహజముగా వీరికి Life లో సుఖ దుఖాలు , కష్ట నస్తములు వస్తూ పోతూ ఉంటాయి . బ్రతుకంతా ఎగుడు దిగుడు గా ఉంటుంది .

కష్టములు ఎదురైనా బెదరి పోకుండా ఎదురొడ్డి పోరాడే మనస్తత్వము కలిగి ఉంటారు . ఆధ్యాత్మిక చింతన , దైవము పట్ల నమ్మకము కలిగి ఉంటారు . వీరి వ్యవహారిక శైలి ప్రత్యేకత కలిగి ఉంటుంది . క్రమ శిక్షణ కలిగిన , ఆదర్శ భావాలు కలిగిన జీవనము గడుపుతారు . ఇతరులకు ఆదర్శప్రాయులై ఉంటారు . ఎదుటి వారిని ఆకట్టుకోగల జనాకర్షణ శక్తి కలిగి ఉందురు . మంచి మాట నేర్పరి తనము కలిగి ఉందురు . సమస్యలను చాకచక్యముగా పరిష్కరించగలరు .

ముఖమునందు తేజస్సు కలిగి ఉందురు . శాంత స్వభావులు , గంభీరమైన హృదయము , జ్ఞాపక శక్తి అధికముగా ఉంటుంది . సూక్ష్మమైన ఆలోచనా శక్తి కలవారు . విషయ పరిజ్ఞానము కలవారు .విద్యా విఘ్నములు కలుగుటకు అవకాశము ఉన్నది . జరగబోవు పరిణామములను ముందుగా ఊహించి చెప్పగలరు . వీరు వ్యాపారము చేపట్టినచో నష్టపోయే సందర్భాలు చాలా తక్కువగా ఉంటాయి . లాభాలే ఎక్కువ .
ఆరోగ్య విషయమున జాగ్రత్త వహించుట అవసరము . పశ్చిమ , ఉత్తర దిశల యందు వీరికి కలసి వచ్చును .

 చర్మ సంభంద వ్యాధులు , దగ్గు , జలుబు , మొదలగు జబ్బులతో భాధ పడతారు . వీరికి 34 సంవత్సరము నుండి యోగదాయక మైన అభివృద్ది కలుగును .  42 సంవత్సరము నుండి స్థిరాస్తి అభివృద్ధి చెందుట , గౌరవ అధికారములు పెరుగును . Sunday and Monday వీరికి కలసి వచ్చును .

అలాగే  2 11 13 20 22 25 7 16 తేదీలు , ఆది సోమా వారములతో కూడి పైన తెలిపిన తేదీలలో వీరికి బాగా కలసి వస్తుంది . ఈ దినములలో ఏ పని చేపట్టిన అనుకూలముగా ఉంటుంది . దైవారాధనలలో గణపతిని , దుర్గామాతను ప్రత్యేకించి సేవించుట ఆరాధించుట వలన మీకు కలుగు కష్ట నష్టముల నుండి విముక్తి లభించును . దైవ శక్తి వెన్నంటి ఉండును .


 7 16 25 34 43 52 61 సంవత్సరములు వీరి జీవియమున బహు యోగాదాయకముగా ఉండును . Dark colors మీకు కలసిరావు . Light colors white , cream , Light rose color  ,sky color , light Yellow color మీకు అనుకూలమైనవి . వైడూర్యము మీకు అనుకూలమైన రత్నము దీనిని ధరించుట శ్రేయోదాయకము .

No comments:

మేషరాశి

ద్వాదశ రాశులను బట్టి మానవుని జీవిత విశేషములను , మానవుల యొక్క గుణ గణాలను తెలుసు కోవచ్చని జ్యోతిష్య శాస్త్రవేత్తలు తెల్పి యున్నారు . మ...