2013-12-26

Number 8

8 సంఖ్య : ఈ సంఖ్యకు ఉన్న విశిష్టత చాలా బలమైనది . అష్ట లక్ష్మీ స్వరూపము . అష్ట వస్తువులు , అష్ట సిద్ధులు , అష్ట ఐశ్వర్యములు మొదలగు వాటికి చైతన్యాత్మకముగా , శక్తి స్వరూపిణి అయిన దుర్గా స్వరూపమే ఈ 8 వ సంఖ్య .దుర్గాష్టమిని తలుచుకుంటే ఈ ఎనిమిదవ సంఖ్యా విశిష్టత ఏమిటో అర్ధము అవుతుంది . శ్రీ కృష్ణ పరమాత్మ కూడా అష్టమి (8 ) నాడే జన్మించాడు . ఈ సంఖ్యకు సంబంధించిన వాడు శని . ఇతడు సూర్య పుత్రుడు . ఈ ఎనిమిదవ సంఖ్యకు సంబంధించిన వారు ఎంత విశిష్టత కలిగి ఉంటారో తెలుసుకుందాము ?

సూర్యుడు ఇతడు కనిపిస్తే లోకమంతా చీకటి ఉండదు . అతని పుత్రుడు అయిన శని కనిపిస్తే జీవితము అంతా చీకటి మయమే . . అంతటి భయంకరమైన శని గ్రహము యోగించిందంటే మిగతా ఏ గ్రహముల వలన కలగనంత మేలు కలుగ జేస్తాడు . ఇతని వలన యోగము కలిగితే మరి ఏ ఇతర గ్రహములు అంతటి యోగమును ఇవ్వలేవు . సకల శుభ కారకుడైన గురు గ్రహము కన్నా మిన్నగా ఈ శని గ్రహము యోగించ గలదు . అంతటి శక్తి సామర్ద్యములు గల శని గ్రహము 8 వ సంఖ్యకు ఆధిపత్యము వహించును .

8 17 26 తేదీలలో పుట్టిన వారి లక్కీ నెంబరు 8 . వీరు నీతి నియమములు కలిగి ఉంటారు . తొందరపాటు ఉండదు . నిదానముగా పని చేస్తారు . మనో నిబ్బరము కలిగిన వారు . వీరు బద్దకమును విడచి పెట్టవలెను . ప్రశాంతత అలవాటు చేసుకోవాలి . వీరు ఏ విషయములో నైన దీర్గాకాలిక ప్రయోజనము కొరకు ఆలోచిస్తారు . ఎంతటి కష్టమైన పనులనైనా శ్రమపడి సాధించగలరు . చిరాకు ఉండదు .

స్వయంకృషి ని నమ్ముకుంటారు . వీరు పుట్టకతో భాగ్య వంతులు కారు . అనేక కష్టములకు ఓర్చి జీవితమున పైకి రాగలరు. హంగు ఆర్భాటములన్న ఇష్టము ఉండదు . విద్యా విషయములో ఆటంకములు , పేదరికము , కుటుంబ భాద్యతల వలన నష్టము కలుగును . ప్రజా సేవ చేయుటలో ముందుంటారు . సామాన్య జీవితమును గడుపుతారు .

వీరికి 15 17 24 26 35 సంవత్సరములలో జీవితమున అనుకోని మార్పులు సంభవించును . ఆరోగ్య విషయమున జాగ్రత్త వహించుట మంచిది . 37 సంవత్సరము నుండి యోగదశ ప్రారంభము అవుతుంది . 44 సంవత్సరము నుండి సంఘములో పలుకుబడి పెరగడము , గౌరవ మర్యాదలు సంపాదించడం జరుగుతుంది .దక్షిణ , ఆగ్నేయ దిశల యందు చేయు ప్రయత్నములు తప్పక ఫలించును .


వీరిని అర్ధం చేసుకుని మసలుకొనే జీవిత భాగస్వామి లభించును . దాంపత్య జీవితము బావుంటుంది . ప్రేమ వ్యవహారముల వలన మోసము జరుగును . వీరిలో చాలా మంది చిన్న స్థాయిలో జీవితమును ప్రారంభించి ఉన్నత స్థితికి చేరుకుంటారు . దీర్ఘకాలం పాటు కష్టపడి అభివృద్ధి లోకి వస్తారు . శని వారం వీరికి కలసి వస్తుంది . 13 22 31 తేదీలు వీరికి లాభాన్ని చేకూరుస్తాయి .  మయూర నీలమును గానీ , ఇంద్ర నీలమును గానీ ఉంగరములో చేయించి ధరించిన అదృష్టము కలుగును . 

No comments:

మేషరాశి

ద్వాదశ రాశులను బట్టి మానవుని జీవిత విశేషములను , మానవుల యొక్క గుణ గణాలను తెలుసు కోవచ్చని జ్యోతిష్య శాస్త్రవేత్తలు తెల్పి యున్నారు . మ...