నక్షత్ర ఫలితము _ కృత్తిక
కృత్తిక
నక్షత్రము లో జన్మించిన వారు న్యాయ వాదులుగా రాణిస్తారు . గంభీరముగా ఉంటారు .
సమర్ధముగా వ్యవహరించువారు . గ్రామ పెద్దలుగానూ , సమాజమున పెద్ద మనుషులుగా చెలామణి ఆగుతారు . సాధారణముగా వీరు
ఇంటిలో పెద్ద కుమారుడై జన్మిస్తారు . అట్లు కాకున్నా అత్త గారింటిలో పెద్ద
అల్లుడవుతారు .
కుటుంబ
భాధ్యతలను ఎంతో సమర్ధవంతముగా నిర్వహించ గలరు . గానీ కొంచెం అహంకారము
ఉంటుంది..వీరికి మంచి విద్య అబ్బును . తెలివి కలవారు . ఇతరులకు ఉపకారము చేయుదురు .
వీరికి పెద్దలయందు గౌరవము ఉంటుంది . రాజకీయముల యందు ఆసక్తి ఎక్కువ . ఎప్పుడు తనకు
పదిమందిలో ప్రత్యేక గౌరవము కలగాలనీ కోరు కొంటారు .
సాహసవంతులు
. చుట్టములతో విరోధములు ఏర్పడతాయి . స్నేహితుల పట్ల ప్రత్యేక అభిమానము ఉంటుంది .
తనను నమ్మిన వారికి కష్ట నష్టములు కలిగినపుడు ఆదుకొనుటలో ముందుంటారు .వేదాంత
జ్ఞానము , దైవభక్తీ ఎక్కువగా ఉంటుంది . తీక్షణమైన దృష్టి
కలవారు . పౌరుష వంతులు .మాట పడనివారు , పట్టుదల కలవారు . వీరు అనుకొన్నది సాధించే వరకు నిద్రపోరు .
వీరు
అనుభవము పెరిగే కొలది లోకమునందు జరుగు వ్యవహారముల గురించి తెలుసుకొంటారు .పరిష్టితులను
తమకు అనుకూలముగా మార్చుకొంటారు . క్రమేణా సంపదను , గౌరవమును పెంచుకొని భాగ్యవంతులవుతారు . వీరికి
ప్రభుత్వఅధికారులతో గానీ , రాజకీయ నాయకులతో గానీ మంచి సంభంధములు ఉంటాయి .
ఇతరులకు ఉపకారము చేయుదురు . మాట వలన గానీ చేత వలన గానీ ఏదో విధముగా సహాయము
చేయుదురు . నమ్మి వచ్చిన వారిని ఆదుకొంటారు .
No comments:
Post a Comment