మనకు
వాస్తు శాస్త్ర పండితులు గ్రామార్వణము గురించి చెప్పియున్నారు . గ్రామార్వణము గురించి ఈ విధముగా చెప్పితిరి .
ఏ
గ్రామము నందు గృహము నిర్మించుటకు స్థలము కొనదలచినారో ఆ గ్రామము యొక్క నక్షత్రము
కనుగొనాలి
( గ్రామము పేరులో ఉన్న మొదటి అక్షరమును బట్టి
నక్షత్రము తెలుయును .)
ఆ
గ్రామనక్షత్రమునుండి
స్థలము కొనదలచిన వ్యక్తీ
యొక్క నక్షత్రము వరకు లెక్కించగా వచ్చు సంఖ్యను బట్టి ఫలితములు తెలుసుకోవచ్చు .
దీనినే నరాకార చక్రమందురు . నరాకార చక్రమునందున్న నక్షత్రముల ఫలితములు ఈ విధముగా
ఉన్నాయి
శ్లోకం : శిరః పంచార్ధ లాభం , ముఖేత్రీ అర్ధ నాశనం , బాణరో
ధన దాన్యంచ పాదయో షట్ దరిద్రః ప్రుష్టేకం ప్రాణ సందేహం
చతుర్నాభి శుభావహం,నేత్రే ద్వి ప్రీతి లాభంచ ,
సవ్యహస్తేన సంపదా , వామ హస్తనే దరిద్రః
తాత్పర్యము
; శిరస్సు నందు 5 నక్షత్రములు ధన లాభము కలుగజేయును , .ముఖము నందు ౩ నక్షత్రములు ధన నష్టమును , .గర్భమునందు 5 నక్షత్రములు ధన, ధాన్య సమృద్ధిని , పాదముల యందు 6 నక్షత్రములు దరిద్రమును కల్గించును, పృష్టం నందు 1 నక్షత్రము ప్రాణ నష్టము సూచించును .నాభి యందు 4 నక్షత్రములు శుభమును , నేత్రముల యందు 2 నక్షత్రములు ప్రీతిని కలుగ జేయును, కుడి చేతి యందు 1 నక్షతము సంపదను , ఎడమ చేతియందు 1 నక్షత్రము దరిద్రమును అనుభవింప చేయును .
ఉదా :
విజయ్ అను వ్యక్తీ గాంధీనగర్ అను గ్రామములో గృహ స్థలము కొనాలని అనుకొన్నాడు
. ఇది అతనికి అనుకూలమా ?
గాంధీనగర్
నక్షత్రము ధనిష్ఠ అవుతుంది . విజయ్ నక్షత్రము రోహిణి . నరాకార చక్రము ప్రకారము
లెక్క వేయగా 9 వ నక్షత్రము కావున శుభ ప్రదము .
ఈ
అర్వణము గ్రామములకు చెప్పబడినది కదా . మరి పెద్ద నగరముల యందు నివసించే వారికి ఎలా
అని సందేహము కలుగక మానదు . వేల , లక్షల జనాభాతో పట్టణాలు పెరిగి పోతున్నాయి . పెద్ద పెద్ద
రియల్ ఎస్టేట్ సంస్థలు పెద్ద వెంచర్స్ వేసి గృహాలను అమ్ముతున్నాయి . వీటికి
అర్వణము ఎలా చూడాలి .
మీరు
నివసించ బోయే వీధి ని గానీ, రియల్ ఎస్టేట్ సంస్థలలో అయితే ప్రాంతము పేరును
బట్టి అర్వణము చేసుకొని వచ్చే ఫలితమును బట్టి గృహ నిర్మాణము చేసుకోవాలి . .
No comments:
Post a Comment