2014-01-29

మూడమి , గోదూలికా ముహూర్తం



మౌడ్యమి
మూడమి లేక మౌడ్యం : గురుడు మరియు శుక్ర గ్రహములు సూర్యునితో కలసి నప్పుడు మూడమి ఏర్పడుతుంది . అనగా గురు గ్రహము సూర్యునకు దగ్గరగా ఉన్నప్పుడు గురు మౌడ్యమి ఏర్పడును . శుక్ర గ్రహము సూర్యునకు దగ్గరగా ఉన్నప్పుడు శుక్ర మూడమి ఏర్పడును . గురుడు మరియు శుక్ర గ్రహములు నైసర్గికముగా శుభ గ్రహములు . ఇవి సూర్యునకు దగ్గరగా ఉన్నప్పుడు అస్తంగతము పొందును . అందు వలన తమ శక్తిని కోల్పోతాయి . శుభ ఫలితములను ఇవ్వలేవు . 

ఉదా : 100౦ వాట్స్ బల్బు ను తీసుకుందాం . అది సూర్యుడని అనుకుందాం .
 దాని ప్రక్కన రెండు 50 వాట్స్ బల్బులను ఉంచితే వాటి కాంతి  1000 వాట్స్ బల్బు కాంతిలో కలసి పోతుంది కదా . అలాగే సూర్యునకు దగ్గరలో ఉన్న ఏ గ్రహములైన తమ శక్తిని కోల్పోతాయి .

అందువలన ఈ మౌడ్యమి ఉన్న కాలములో శుభ కార్యములు జరుపకూడదు . ముఖ్యముగా వివాహము , గృహారంభము , గృహ ప్రవేశము మొదలగు సమస్త శుభకార్యములు చేయరాదు . నక్షత్ర శాంతి , నవగ్రహ దోష పరిహారములు , హోమము , జపములు , అభిషేకములు వంటివి చేయవచ్చును .

గోదూలికా ముహూర్తము
సూర్యుడున్న ముహూర్తమునుండి ఏడవది గోదూలికా ముహూర్తమని అనబడును . విపులంగా చెప్పాలి అని అంతే పూర్వము పశువులు ఎక్కువగా ఉండేవి . ఉదయాన్నే  ఊరి బయటకు మేతకోరకు పశువులను తోలుకు పోయేవారు. తిరిగి సాయంకాలము సూర్యాస్తమయమునకు ముందుగా ఇంటికి తోలుకు వచ్చేవారు . అలా వచ్చే సమయములో పశువుల మంద వచ్చేటప్పుడు ధూళి రేగేది .

 అలాంటి సమయమును గోదూలికా ముహూర్తముగా వివరించితిరి .  క్లుప్తంగా చెప్పాలంటే సాయంకాలం 4 . ౩౦ నిమషముల నుండి సుమారు 06 గంటల వరకు ఈ సమయము ఉండును. దీనినే గోదూలికా ముహూర్తము అని అంటారు . ఈ ముహూర్తమును సకల శుభాలకు ఉపయోగించ వచ్చును . వర్జ్యము , దుర్మూహర్తములతో పనిలేదు .

No comments:

మేషరాశి

ద్వాదశ రాశులను బట్టి మానవుని జీవిత విశేషములను , మానవుల యొక్క గుణ గణాలను తెలుసు కోవచ్చని జ్యోతిష్య శాస్త్రవేత్తలు తెల్పి యున్నారు . మ...