2013-09-04

సంక్రమణం



మన మహర్షులు సూర్యుడు మరియు భూమి యొక్క గమనముననుసరించి కాలమును లెక్క వేయుటకు ఒక విధానమును అనుసరించినారు . భూమితన కక్ష్యలోతిరిగే విధమును బట్టి 360 డిగ్రీలుగా 12 రాశులుగా విభజించినారని మనము తెలుసుకొన్నాము. ఈ 12 రాసులనే ద్వాదశ భావములుగా ద్వాదశ లగ్నములుగా చెప్పినారు..
ఇక్కడ మరియొకసారి చెప్పు చున్నాను మొత్తం భూ కక్ష్యను అంతటిని 360 డిగ్రీలుగా విభజించాలి. భూమితనకక్ష్యలో "0" డిగ్రీవద్ద ఉన్నప్పుడు మేషరాశిలో ఉంటుంది. ( సుమారుగా ప్రతిసంవత్సరం ఏప్రిల్ 13,14 తేదిలలో}. దీనినే మనము జాతక చక్రములో సూర్యుడు మేషరాశిలో ఉన్నట్లు చూపిస్తున్నాము.దీనినే మేష సంక్రమణం అనిఅందురు. 

భూమితనకక్ష్యలో సుమారుగా రోజుకొక డిగ్రి చొప్పున తన కక్ష్యలో ముందుకు పోవుచున్నదని తెలుసుకొన్నాం మేష సంక్రమణం జరిగిననాటి నుండి 30 రోజులకు 30, డిగ్రీలను దాటి భూమి 31వ డిగ్రీలో ప్రవేశించును . దీనినే వృషభ సంక్రమణమని అందురు .
60    డిగ్రీలను దాటి భూమి 61వ డిగ్రీలో ప్రవేశించుటను మిధున సంక్రమణ మని
90,   డిగ్రీలను దాటి భూమి 91వ డిగ్రీలో ప్రవేశించుటను కర్కాటక సంక్రమణ మని
120,డిగ్రీలను దాటి భూమి 121వ డిగ్రీలో ప్రవేశించుటను సింహ సంక్రమణ మని
150 డిగ్రీలను దాటి భూమి 151వ డిగ్రీలో ప్రవేశించుటను కన్యా సంక్రమణ మని
180,డిగ్రీలను దాటి భూమి 181వ డిగ్రీలో ప్రవేశించుటను తులా సంక్రమణ మని
210 డిగ్రీలను దాటి భూమి 211వ డిగ్రీలో ప్రవేశించుటను వృశ్చిక  సంక్రమణ మని
240 డిగ్రీలను దాటి భూమి 241వ డిగ్రీలో ప్రవేశించుటను ధను స్సంక్రమణ మని
270 డిగ్రీలను దాటి భూమి 271వ డిగ్రీలో ప్రవేశించుటను మకర  సంక్రమణ మని
300 డిగ్రీలను దాటి భూమి 301వ డిగ్రీలో ప్రవేశించుటను కుంభ  సంక్రమణ మని
330 డిగ్రీలను దాటి భూమి 331వ డిగ్రీలో ప్రవేశించుటను మీన సంక్రమణ మని
ఈవిధముగా ద్వాదశరాశులకు భూమి గమనమును బట్టి ద్వాదశ సంక్రమణ ములను తెలుసుకొనవచ్చు.

2013-09-02

శనిగ్రహము


శనిగ్రహమును గురించి కొంత తెలుసుకుందాం .
గ్రహము లన్నిటిలో శనిగ్రహము  చాలా పెద్దది . నెమ్మది స్వభావము కలిగినది . నల్లని రూపము కలది .ఈ గ్రహ స్వరూపము లక్షణములను అనుసరించి మానవుడు చేయు కర్మలు ( వృత్తులు ) ఈ విధముగా ఉంటాయి . ఈ గ్రహము యొక్క ప్రభావము విశ్వం అంతటా వ్యాపించి యుండును . 

మానవుడు జీవించి ఉన్నపుడు , మరణానంతరము కూడా కీర్తిని సంపాదించువారు ఈ గ్రహ ప్రభావము లోనివారే .
శని గ్రహము యొక్క ప్రభావముచే జన్మించిన వారు తాత్కాలిక ప్రయోజనముల కొరకు ఆశించరు . వీరు దీర్ఘకాలిక ప్రయోజనము కొరకు పాటు పడతారు .  సమాజ శ్రేయస్సు కొరకు , దీన జనోద్దరణ కొరకు కృషి చేయుదురు . ఐహిక సుఖములకై తాపత్రయ పడరు . లక్ష్య సాధన కొరకు ఓపిక , సహనముతో ఉంటారు . హక్కుల కొరకు , బానిసత్వ నిర్మూలన కొరకు పోరాడు తత్వము కలిగి ఉందురు . ఆదర్శ పురుషులు ఈ కోవకు చెందిన వారే .

ఉదా : వివేకానందుడు , గాంధీజీ , రామకృష్ణ పరమహంస , లాంటి గొప్ప గొప్ప నాయకులు , సంఘ సంస్కర్తలు మొదలగు వారందరూ ఈ గ్రహము యొక్క అంశ లో పుట్టిన వారే .
     
ఈ గ్రహ ప్రభావము వలన మానవుడు గుంపులకు , సమూహములకు ఆధిపత్యము మరియు నాయకత్వము  వహించును . ఇక్కడ మనము ఒక విషయమును అర్ధం చేసుకోవాలి . సూర్యుడు అధికారమునకు , నాయకత్వమునకు కారకుడు . శని గ్రహము సేనలకు , సేవకులకు కారకుడు .  సూర్యుడు మరియు శనిగ్రహము కాంబినేషన్ లో ఈ రెండు గ్రహముల ఆధిపత్యము బలముగా ఉన్న జాతకులు రాజకీయముల యందు రాణించ గలరు . అనగా ప్రజా సమూహములకు నాయకత్వము వహిస్తారు .

సాధారణముగా ఇటువంటి జాతకులు మొదట సాధారణ జీవితమును ప్రారంభించి అంచెలంచెలుగా ఉన్నత శిఖరముల నదిరోహింతురు . వీరు జీవితమున ఉన్నత ఆశయముల కొరకు పోరాడు చుందురు . పెద్ద పెద్ద బారీ సంస్థలు వీరిచే నిర్మింప బడతాయి . వీరిచే మొదలు పెట్ట బడిన సంస్థలు గానీ , ఉద్యమాలు గానీ ఎంతో కాలం పాటు కొనసాగుతాయి .  స్వంతత్ర ఉద్యమం లాంటివి ఈ కోవలోనివే .

ఇకపోతే ఈ శని గ్రహ అంశయందు పుట్టిన వారు రైల్వేస్ , స్టీల్ ప్లాంట్స్ , ఇనుము , ఉక్కు సంబంధిత పరిశ్రమలలో , గాలికి సంబంధించిన అనగా మొబైల్ పోన్ , సమాచార శాఖలు , పోస్టల్ ,  టెలీఫోన్ , రంగాలలోనూ , రాజకీయాలలోనూ , నూనె పరిశ్రమలు , పెట్రోల్ , డీజిల్ లాంటి ఆయిల్ పరిశ్రమలు ,పరోశోధన రంగములలో ఉన్నత స్థాయి కలిగిన స్థితికి చేరతారు .

 శని గ్రహము నీచ స్థితిలో , శత్రుక్షేత్ర స్థితి లో ఉండి సూర్యునికి 6 8 స్థానములలో ఉన్న జాతకులు సాధారణ జీవనము గడుపుతారు . ఇట్టివారు ఎంత ప్రయత్నించిననూ పైకి రాలేరు . సేవకులుగా , పనివారు గా , కష్ట జీవనము గడుపుచూ బ్రతకడానికి పోరాడుచుందురు . పేదరికమును అనుభవింతురు . సమాజమున గుర్తింపు ఉండదు .      

2013-09-01

సూర్యుడు – శుక్రుడు



జాతకము లో గ్రహములు బలమును గురించి వివరించు కుంటున్నాము.
ఇప్పుడు  సూర్యుడు – శుక్రుడు ఈ కాంబినేషన్ కు సంబంధించి చర్చిద్దాం .
జాతకము లో సూర్యుడు – గురుడు , శుక్రుడు ఈ గ్రహములు ఒకే సరళ రేఖపై ఉన్నప్పుడు లేక దగ్గర దగ్గరగా ఉన్నప్పుడు మూఢమి ఏర్పడుతుంది . సూర్యుడు తో  కూడిన లేక కలసి ఉన్న ఏ గ్రహమైనా శుభ ఫలితములు ఇవ్వదు . కావున గ్రహములు ఈ కాంబినేషన్ లో ఉన్నప్పుడు వివాహము , గృహ ఆరంభము మొదలగు సమస్త శుభ కార్యములు  చేయకూడదు అని మహర్షి వచనము .

కానీ జాతకము పరిశీలనలో పైన తెలిపిన విషయములు వర్తించుట లేదు . జాతకము పరిశీలన చేసే టపుడు గ్రహముల కలయికను మాత్రమే చూడ కూడదు. ఫలిత నిర్ధారణ చేయు నపుడు గ్రహము జన్మ లగ్నము నుండి ఏ భావము నకు అధిపత్యము వహించు చున్నది. ఏ ఏ భావాధిపతు లతో కలసి యున్నది .ఏ క్షేత్రము నందున్నది . ఏ క్షేత్ర భావ అధిపతులతో చూడబడు చున్నది . ఇలా అనేక విషయములను పరిశీలించాలి .

సూర్యుడు – శుక్రుడు . ఈ కాంబినేషన్ బాగున్న జాతకులు ఆకర్షణీయ రూపము కలిగి ఉంటారు . వీరు కళా రం గమున ఎలక్ట్రానిక్ మీడియా , సినిమా , నాటక రంగము , గాయకులు , సంగీత విద్వాంసులు , మొదలగు రంగములలో స్థిరపడతారు . వస్త్ర పరిశ్రమలు , అద్దకం పరిశ్రమలు , అలంకరణ సామగ్రి , పర్యాటక రంగములలో జీవనము సాగించ గలరు . వినోద రంగముల యందు , మహిళలు కు సంబంధించిన అనేక రంగములలో, జీవనము సాగించ గలరు . విలాస వంతమైన జీవితమును గడుపుతారు .

సూర్యుడు – శుక్రుడు కాంబినేషన్ బలముగా ఉన్నవారు . పైన తెలిపిన విభాగములలో అత్యున్నత స్థాయిని పొందుతారు . ఈ కాంబినేషన్ బాగులేనివారు  వ్యసన పరులు , స్త్రీల పట్ల ఆకర్షితులై , కామోద్రిక్తులై ఉంటారు . వ్యసనముల బారిన పడి జీవితమును నాశనము చేసుకుంటారు . కుటుంబము పట్ల భాద్యత ఉండదు . వీరికి ఆదాయము కన్నా ఖర్చులు అధికముగా ఉంటాయి .    

మేషరాశి

ద్వాదశ రాశులను బట్టి మానవుని జీవిత విశేషములను , మానవుల యొక్క గుణ గణాలను తెలుసు కోవచ్చని జ్యోతిష్య శాస్త్రవేత్తలు తెల్పి యున్నారు . మ...