2017-04-16

వివాహ పొంతన



వధూవరులకు వివాహ పొంతన చూసేటప్పుడు ముఖ్యముగా 8 కూటములను పరిగణన లో తీసుకొన్నారు .
1 వర్ణకూటమి  2 వశ్యకూటము ౩ తారాకూటమి 4  యోనికూటము 5 గ్రహకూటమి 6. గణకూటమి 7 రాశికూటమి 8 నాడీకూటమి
వర్ణకూటమి : స్త్రీ పురుషులు ఇద్దరు ఒకే వర్ణమునకు చెందిన వారయితే మంచిది.
రవి , కుజులు క్షత్రియులు , గురు , శుక్రులు బ్రాహ్మణులు , బుధ, చంద్రులు వైశ్యులు, శని శూద్రుడు, రాహు కేతువులు మ్లేచ్చులు

2 . వశ్యపొంతన : మేషరాశికి - సింహము ,వృశ్చికం, వృషభ రాశివారికి కర్కాటక ,తులారాశులు , మిదునమునకు కన్యరాశి, కర్కాటకరాశికి వృశ్చికం, ధనుస్సు , సింహరాశికి తులారాశి ,  కన్యకు మిధున , మేషములు , తులా రాశికి కన్య, మకరం, వృశ్చికరాశికి కర్కాటకం ,ధనుస్సుకు మీనము , మకర రాశికి మేషం , కుంభం కుంభరాశికి మేషము , మీనమునకు మకరం ఈ విధంగా పై రాశులు వశ్యము కలిగి ఉన్నవి . వధూవరులు ఇద్దరి రాశులు వశ్య పొంతన కలిగి ఉండవలెను .

౩. తారా పొంతన : స్త్రీ జన్మ నక్షత్రమునుండి పురుషుని జన్మ నక్షత్రము వరకు లెక్కించిన సంఖ్యను 9 చే భాగించగా 1 , ౩ , 5 , 7 శేషము రాకూడదు

4 . యోనిపొంతనము : పులి ఆవు , పిల్లి ఎలుక , లేడి కుక్క , గుఱ్ఱము దున్న , పాము ముంగిస , సింహం ఏనుగు , కోతి- మేక  ఇవి విరోధ జంతువులు ఇంతకు ముందర నక్షత్రములు వివరణ అను శీర్షికలో నక్షత్రములు జంతువులను గూర్చి వివరించితిని . వధూవరుల ఇరువురు నక్షత్రములు విరోధ జంతువులకు సంబంధించినవి  కాకూడదు . ముఖ్యముగా యోనిపొంతన అవసరము .

5 గ్రహకూటమి : సూర్యుడు శని , చంద్రుడు బుధుడు , కుజుడు బుధుడు .గురుడు శుక్రుడు ఈ పైన తెలిపిన గ్రహములు ఒకరికొకరు పరస్పం శత్రువులు గ్రహ కూటమి ని చూసేటప్పుడు పై విధంగా ఉండ కూడదు.

6 గణ కూటమి : ఇరువురు ఒకే గణమునకు చెందిన వారైతే నిర్భయంగా వివాహము చేయవచ్చును . ఒకరిది దేవగణం , మరియొకరిది రాక్షస గణమైన కొద్ది ఇబ్బండులున్ననూ చేయవచ్చును , రాక్షస మానుష్య గణములు మృత్యుప్రదమని సూచించిరి . కానీ ప్రస్తుత కాలములో గణ పొంతన వలన అంత అపాయములు జరుగుటలేదు . 

7. రాశి పొంతనము : వధూ వరుల ఇరువురి రాశులు పరస్పరం మిత్రత్వము కలిగి ఉండవలెను . స్త్రీ రాశి నుండి పురుష రాశి 7 రాశుల కన్నా ఎంత ఎక్కువ ఉంటె అంట మంచిది . దీనినే స్త్రీ దీర్గ పొంతన అని అందురు . ఇరువురి రాసులలోనూ ద్వి, ద్వా దశము , షష్ఠ , అష్టకములు కాకూడదు . ఇది చాలా చాలా ముఖ్యము , ద్వి ద్వా దశము వలన అంతగా ప్రమాదము జరుగుట లేదు కానీ , షష్ట అష్టక స్థితి వలన చాలామంది , విడాకులు తీసుకోవడమో ,,అనారోగ్యము పొంది జీవితము అంధకారమగుచున్నది . ఒక్కొక్కప్పుడు ప్రాణ నష్టము సంభవించు చున్నది .    

8 నాడీపొంతనము : వధూవరులు ఇద్దరూ వేర్వేరు నాడులకు చెందిన వారై ఉండాలి . ఏక నాడియందు వివాహము చెయ్యరాదు .
ఆద్యే సుత హత: ,అంత్యే ధన హత: మధ్యే వనితా పతి వియోగ :
అని చెప్పబడిన కారణము వలన దంపతులు ఇరువురు ఆది నాడికి చెందిన వారైతే సంతాన నష్టము కలుగునని , అంత్య నాడికి చెందిన వారైతే ధనమునకు ఇబ్బంది ఏర్పడుననీ , మధ్యనాడి చెందిన వారైతే స్త్రీ పురుషుల మధ్య వియోగము ఏర్పడునని , ఎడబాటు కలుగుననీ చెప్పితిరి .
కావున ప్రతి ఒక్కరు వివాహ పొంతనలను చూసుకొని వివాహము జరుపుకొనుట వలన దాంపత్య జీవితము హాయిగా ఉంటుంది .

2015-04-18

లగ్నము – కుజుడు 1- 6

మేషలగ్నమునకు లగ్న అష్టమ అధిపతి అయిన కుజుడు 12 భావములయందు ఉన్నప్పుడు ఇచ్చు ఫలితములు .
లగ్నము నందు కుజుడున్న జాతకులు శౌర్య పరాక్రమములు కలవారు , ఓపిక సహనము తక్కువ . కొద్దిగా కోపస్వభావము ,చిరాకు కలిగి ఉందురు . వీరి శరీరము ఉష్ణ స్వభావము కలిగి ఉండును . సన్నగా ఉంటారు . ఎర్రని శరీర చాయ కలిగి , క్షత్రియ లక్షణము కలిగి ఉంటారు .

2 వ ఇంట అనగా వృషభము లో కుజుడున్న జాతకులకు భూముల వలన , వ్యవసాయము, పంటల ద్వారా ధన యోగము కలుగును . తాత , ముత్తాత ల ఆస్తులు , వారసత్వ ఆస్తులు కలసి వచ్చును . అట్లు లేకుండిన జాతకులు స్వతంత్రముగా ఆస్తులను గడింతురు . వీరు భూములపై పెట్టుబడి ( ఇన్వెస్ట్మెంటు) పెట్టుట మంచిది . వివాహ విషయములో కొంత ఆలస్యము జరుగును .

౩ వ స్థానము మిధునము అగుచున్నది . ఇది బుధుని రాశి . ఈ రాశి కుజునకు శత్రు క్షేత్రము . ఈ భావము సోదర , సోదరీలను సూచించు చున్నది . ఇక్కడ కుజుడున్న జాతకులకు అన్న తమ్ములు ఎక్కువగా ఉందురు కానీ . జాతకునకన్నా పెద్ద వారైన అన్నలకు నష్టము కలుగును . అన్న తమ్ముల మధ్య సరియైన ఐకమత్యము ఉండదు .

నాల్గవ స్థానము కర్కాటక రాశిలో కుజుడు నీచ స్థితి కలిగి ఉండును . ఇక్కడ కుజుడున్న జాతకులు గృహము నిర్మించిననూ ఏదో ఒక లోపముండును . సరియైన గృహ వసతి లేక పోవును . వీరు తల్లి తండ్రి పట్లకొంత వివక్ష కలిగి ఉంటారు .బంధువుల పట్ల గానీ ఇతరుల పట్ల గానీ కొంత ఈర్ష్య, అసూయ కలిగి ఉండు అవకాశమున్నది . స్వయంకృత అపరాధము వలన కొన్ని కష్టములను కొనితెచ్చు కొంటారు.

పంచమ స్థానమైన సింహ రాశి లో కుజుడు మిత్ర క్షేత్ర స్థితి కలిగిన వాడే అయినప్పటికీ . ఇది సంతాన స్థానము . ఇక్కడ కుజుడు ఉండుట వలన జాతకులకు సంతాన నష్టము కలుగును . స్త్రీలకు ప్రత్యేకించి గర్భ స్రావము కల్గుచున్నది . తొలి సంతానము నష్టము తప్పదు . లేక అబార్షన్ అవుతుంది. వివాహము జరిగిన తరువాత సంతానము కొరకు మెడికల్ ట్రీట్మెంట్ అవసరము . మందుల వాడకము తర్వాత సంతానము కలుగు సూచన ఉన్నది .ఇక్కడ గురు గ్రహ స్థితి బాగుంటే సంతానము వెంటనే కలుగుతుంది .

ఆరవ భావమైన కన్యారాశి కుజునకు శత్రు క్షేత్రము ఈ స్థానములో కుజుడున్న జాతకులకు అనారోగ్యము తప్పదు . రక్త సంభంద రోగములు వచ్చును , ఆస్తులు , భూములు మున్నగునవి కోర్టు వ్యవహారములలో ఇరుక్కుపోవును , తగవులను , పోలీసు కేసులను ఎదుర్కొన వలసి వచ్చును . ముఖ్యముగా కుజ దశా అంతర్ధశ సమయములలో పై ఫలితములు జరుగుతాయి .       

2015-04-07

లగ్నము – కుజుడు 7-12

లగ్నమునకు 7 ఇంట కుజుడున్న జాతకులకు వివాహము ఆలస్యంగా జరుగును. భార్యా , భర్త ఇద్దరూ ఒకరికి ఒకరు పంతాలు పట్టింపులకు పోవుదురు . వీరు తమకు నచ్చిన జీవితభాగస్వామిని స్వంతంత్రముగా ఎన్నుకొనలేరు.జీవిత భాగస్వామిని తమకు అనుకూలముగా మార్చుకోలేక ఇబ్బంది పడతారు .  

8 వ ఇంట కుజుడున్న జాతకులకు ఆయుస్సు బాగుంటుంది . వారసత్వ సంపద వృద్ది కలుగుతుంది .కానీ కుటుంబ సభ్యుల మధ్య ముఖ్యముగా ఆస్థి సంబంధ వ్యవహారములలో సమస్యలు ఎక్కువగా ఉంటాయి .

భాగ్య స్థానమైన ధనుస్సు లో కుజుడు మిత్ర క్షేత్ర స్థితిలో ఉన్నటువంటి జాతకులకు పితృ భాగ్యము , ఉంటుంది . కానీ జాతకులు యవ్వన సమయములో తండ్రికి కొంత ఆర్ధికపరమైన నష్టములు, శారీరక సమస్యలు , ఏర్పడతాయి . ఇక్కడ కుజుడున్న జాతకులు తండ్రికి మించిన తనయులు కాగలరు . విశేష కీర్తిని , పేరును సంపాదించి కుటుంబ గౌరవమును పెంచెదరు .

పదవ ఇంట మకరరాశి లో కుజుడు ఉచ్ఛ స్థాన గతుడై ఉన్నటువంటి గ్రహ స్థితి కలిగిన జాతకులు రుచక మహా పురుష యోగమును పొందుతారు . ఈ యోగ ప్రభావముచే జాతకులు సామాన్య కుటుంబమున జన్మించిన వారైననూ జీవితములో అత్యున్నత స్థానమును పొందగలరు . మంచి జీవన స్థితి ( ఉద్యోగము , వ్యాపారము , అధికారము ) ఏర్పడును . కానీ మధ్య , మధ్యలో కొన్ని ఒడుదుడుకులు ఏర్పడతాయి .వీరు స్వయంకృతాపరాధము వలన పౌరుషమునకు పోయి ఎంతటి పనినైనా ( అది డబ్బైనా కావచ్చు లేక ఉద్యోగమైనా కావచ్చు ) మధ్యలో విడచి పెడతారు .      .  

11 వ స్థానమైన కుంభ రాశిలో కుజుడు స్థితి యుండగా జన్మించిన జాతకులు భూముల వలన , సోదరుల వలన విశేషముగా లాభ పడుదురు . వీరికి సాధారణముగా బ్రతుకును గురించి చింత యుండదు . ఎల్లవేళలా ఏదో ఒక వ్యాపకముతో గడుపుతారు . సోదరుల ప్రోత్సాహముతో ఉన్నత స్థితికి చేరుతారు .భూ సంభంద వ్యవహారములలో బాగా కలసి వస్తుంది .

12 వ స్థానమైన మీనరాశి లో కుజుడు మిత్ర క్షేత్ర స్థితిని పొంది యుండగా జన్మించిన వారు దాన ధర్మములు ఎక్కువగా చేయుదురు . వీరు సుఖపడుట తక్కువ . పూర్వీకుల నుంచి సంక్రమించిన ఆస్థిని పాడు చేయుదురు . జీవితము యొక్క అంతిమ సమయములో కొంత ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కొంటారు . ముందు చూపు లేక పోవుట వలన డబ్బును వృధా వ్యయము గావించుట వలన అనేక కష్ట నష్టములు ఏర్పడును .

మేషరాశి

ద్వాదశ రాశులను బట్టి మానవుని జీవిత విశేషములను , మానవుల యొక్క గుణ గణాలను తెలుసు కోవచ్చని జ్యోతిష్య శాస్త్రవేత్తలు తెల్పి యున్నారు . మ...