2013-08-28

గ్రహములు - కక్ష్యలు


పై చార్ట్ లో గ్రహముల కక్ష్యలను గురించి చూపించడం జరిగింది . మన జ్యోతిష్య శాస్త్రజ్ఞులు  చెప్పినట్లు 7 గ్రహముల ను ఉదహరించాను .

జ్యోతిష్య శాస్త్ర వేత్తలు భూమిని గ్రహము గా  సూచించలేదు . మన జ్యోతిష్య విధానము ప్రకారము తొమ్మిది గ్రహములు ఉన్నవి .  పైన తెలిపిన గ్రహములలో భూమిని మినహా యిస్తే  7 గ్రహములే  యున్నవి . మిగతా రెండు గ్రహముల సంగతి ఏమిటి ? అని ఆలోచించి నపుడు మనకు కాస్త  సంశయము కలుగుతుంది . దీనికోసం తెలుసుకోవాలంటే మనం  లోతుగా శాస్త్ర పరిశోధన చేయుటయే కాక మహర్షుల చే చెప్పబడిన నిగూఢ మైన విషయములను అర్ధం చేసుకోవలసిన అవసరము ఉన్నది .


ఉదాహరణకు
సూర్యుడు , చంద్రుడు -              మండల గ్రహములు  అని
కుజుడు , బుధుడు , గురుడు , శుక్రుడు మరియు  శనిగ్రహము -         తారా (స్టార్ ) గ్రహములు 
రాహువు ,  కేతువు -           ఛాయా గ్రహములని  సూచించినారు . {చాయ అనగా నీడ అని అర్ధము }.


సౌర కుటుంబము అంతటిని 360 డిగ్రిలుగా విభజించి 12 రాశులు గా నిర్ణయించినారు ..  .
సూర్య గ్రహణం   అమావాస్య  రోజు పగటి పూట ఏర్పడుతుంది.
చంద్ర గ్రహణం   పౌర్ణమి రోజు  రాత్రి పూట ఏర్పడుతుంది .

2013-08-27

గ్రహములు - జాతులు2



జ్యోతిష్య శాస్త్రములో గ్రహములను గురించి తెలిపిన జాతులను గురించి ఇంతకు ముందు తెలుసుకొన్నాం .
అయితే ఏ ఏ గ్రహములు ఏ జాతికి చెందినవి . ఆయా గ్రహముల స్వభావము , లక్షణములు మానవ జీవితము పై ఎలాంటి ప్రభావము చూపిస్తాయి అను విషయములను గురించి కొంత తెలుసు కొందాం .

సూర్యుడు , కుజుడు క్షత్రియలు  
చంద్రుడు , బుధుడు , వైశ్యలు   
గురుడు , శుక్రుడు బ్రాహ్మణులు
శనిగ్రహము శూద్రజాతికి చెందినది .
రాహువు , కేతువు మ్లేచ్చ జాతికి చెందినవారుగా మనకు జ్యోతిష్య శాస్త్రజ్ఞులు తెలియ చేసారు .

సాధారణముగా ఎవరైనా తమ గురించి తాము తెలుసుకోవాలని అనుకొన్నప్పుడు  నా రాశి ఫలితము ఎలావుంది . నా నక్షత్ర ఫలితము బావుందా అని అడుగుతూ ఉంటారు .
రాశి , నక్షత్రముల ఆధారముగా ఫలితమును తెలుసుకోవడం వలన మంచి ఫలితములను రాబట్ట లేము .
మానవుడు జన్మించిన జన్మ లగ్నమును అప్పుడున్న గ్రహములు ఉన్న స్థితులను ఆధారముగా ఫలితములను తెలుసు కోవడమే ఉత్తమ మార్గము.

ఈనాడు మానవుడు బ్రహ్మాండము నుండి అతి సూక్ష్మమైన పరమాణువు వరకు పరిశోధన చేయు శక్తి, సామర్ధ్యములను , తెలివి తేటలను తన సొంతం చేసుకొన్నాడు . కానీ ఎందుచేతనో ఏమో గానీ జ్యోతిష్య శాస్త్రము పరిశోధనల విషయములో నిరాదరణకు గురియైనదని చెప్పక తప్పదు .

ఈ సమయములో మహర్షులు మనకు అందించిన జ్యోతిష్య శాస్త్ర సూత్రములను ఉపయోగించి పరిశోధన చేస్తే మానవ జీవితము పై గ్రహముల ప్రభావము వలన కలుగు అన్ని విషయములను సూక్షముగా తెలుసుకోగలము.

ఇక పైన తెలిపిన విషయములను గురించి చర్చించుకొందాం .   

జాతకము లో బలీయమైన గ్రహము సూర్యుడు అయితే క్షత్రియ లక్షణములు కలిగి ఉంటారు . ఇట్టి వారు ప్రభుత్వములో పదవులను పొందుతారు . రాజకీయ నాయకులు కాగలరు. సూర్యుడు యొక్క బలమును అనుసరించి విలేజ్ ప్రెసిడెంట్ నుండి ప్రధాన మంత్రి వరకు పదవులు పొంది అధ్యక్షులుగా వ్యవహరించగలరు .
జాతకము లో సూర్యుడు బలము ఆధారము గా వచ్చే పదవులు వార్డ్ మెంబరు నుండి రాష్టపతి వరకు ఎలాంటి పదవులైన నిర్వహించగల సమర్ధత మానవుడు పుట్టిన సమయములో ఉన్న గ్రహముల స్థితుల ఆధారముగా మాత్రమే తెలియును .,


ఏ ఒక్క గ్రహము బలమునో ఆధారముగా చేసుకొని నిర్ణయము చేయలేము .
రాజ్యాధికారము పొందే విషయములో సూర్యుడు తో కలసి ఉన్న గ్రహముల ను కూడా పరిశీలించాలి. కర్మ స్థానమును , ఆ స్థానము లో ఉన్న గ్రహములు , ఆస్థానమును చూస్తున్న గ్రహములు జాతక చక్రములో సూర్యుడు , 10 వ స్థానమునకు ఉన్న సంబంధము ఇలా అనేక విషయములను పరిశీలించాలి .

అదే విధముగా నడుస్తున్న గ్రహముల దశలను కూడా పరిగణన లో తీసుకోవాలి .

సూర్యుడు బలముగా ఉండి చంద్రునితో కలసి ఉంటే నీటి పారుదల సంఘములకు అధిపతులు గానూ, జల వనరుల శాఖ మంత్రులుగా రాణిస్తారు .పాడి పరిశ్రమ , వాటర్ ట్రిబ్యునల్స్ , రిజర్వాయర్స్ , ఫిషరింగ్ డిపార్టమెంట్లు మొదలగు వాటిలో పదవులను పొందగలరు . ఇక్కడ చంద్రుడు నీరు , పాలు సంబంధిత శాఖలకు ఆధిపత్యము వహించుననీ తెలుసుకోవలసి ఉంటుంది .

సూర్యుడు , కుజుడు సంబంధము లో ఉంటే వ్యవసాయ శాఖలలో , గృహ నిర్మాణ శాఖలలోనూ ,అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ , పోలీస్ , మిలటరీ , ఆర్మీ , పోర్స్ సంభందిత శాఖల లోనూ , రక్షణ శాఖా సంబందిత శాఖలలోనూ పదవులను పొందుతారు .
అధికారిక హోదా అయిననూ కుజుడు బలహీనము అయితే సెక్యురిటీ గార్డ్ , గన్మెన్ సంబంధిత ఉద్యోగాలను పొందుతారు . కుజుడు బలవతుడు అయితే పైన తెలిపిన శాఖలలో గొప్ప అధికారములను పొందు పదవులను చేపడతారు .

తదుపరి భాగములో ....................................,   

2013-08-26

గ్రహములు - జాతులు1



జ్యోతిష్య శాస్త్రములో గ్రహముల ను గురించి వివరిస్తూ గ్రహముల కు జాతులను నిర్ణయించినారు . జాతులు అనగా కులాలు అని తెలుసు కోవలసిన అవసరము ఉన్నది . అయితే కులముల ప్రస్తావన ఏమిటి ? కులములు ఎందుకు ఏర్పడ్డాయి ? . గ్రహముల కు , జాతులకు సంబంధం ఏమిటి . అని చాలా లోతుగా అధ్యయనము చేయవలసిన అవసరము ఎంతైనా ఉన్నది .

జ్యోతిష్య శాస్త్రములో సూచించిన జాతులు 5
బ్రాహ్మణులు , క్షత్రియులు , వైశ్యులు , శూద్రులు , మ్లేచ్చులు అని అయిదు రకములుగా విభజించారు.
.
జ్యోతిష్య శాస్త్రము మొత్తం విశ్వం గురించి , ఈ ప్రపంచములో భూమిపై జన్మించిన మానవులందరి గురించి భూత, భవిష్యత్ , వర్తమాన విషయములను తెలుసు కొనుటకు కనుగొన బడినది .

కుల వ్యవస్థ ఉన్న భారత దేశములో ఆనాటి పరిస్థితులను ఉద్దేశించి అలా చెప్పి ఉంటారు . కానీ ఇతర దేశాలలో అనగా కుల వ్యవస్థ లేని దేశాలలో ఉన్నవారికి ఎలా ఫలిత నిర్ధారణ చేయగలము . ఇప్పుడు ఉన్న కులములకు జ్యోతిష్య శాస్త్రములో చెప్పబడిన కులములకు సంబంధం కుదురుట లేదు .  .

పూర్వకాలములో ముఖ్యముగా మన భారత దేశములో రాజుల పరిపాలన ఉండేది . ఈ భారత దేశములో అనేక చిన్న చిన్న సామంత రాజ్యములను రాజులు పరిపాలించేవారు. పరిపాలకులను క్షత్రియులు గా భావించాలి .

రాజుగారు ప్రభుత్వమును నడుపుటకు సలహాలు సూచనలు ఇవ్వడము , క్లిష్ట సమయములలో సరియైన నిర్ణయములు చేయడం , రాజ్యములో సిద్దాంతములను , రాచరికపు వ్యవస్థలను కాపాడే వారిని , కొత్త కొత్త పరిశోధనలు చేసి మానవ అభివృద్దికి తోడ్పాటు నందించే  మేధావులను బ్రాహ్మణులు గా భావించాలి.

ప్రజలకు కావలసిన వస్తు సామగ్రిని , సరఫరా చేస్తూ వ్యాపారము, వర్తక వాణిజ్యము చేయు వారిని వైశ్యులుగా భావించాలి .

శారీరక శ్రమ కోర్చి ,కష్ట పడే కష్ట జీవులను శూద్రులుగా భావించవలసి ఉంటుంది .
ఇక సంఘ వ్రతిరేక కార్యకలాపము లకు పాల్పడడం , ప్రజా వ్యతిరేక విధానములో ఉన్నవారిని మ్లేచ్చ జాతికి చెందినవారిగా గుర్తించాలి . అంతేగానీ ఇప్పుడుమన ఆచారములో ఉన్న బ్రాహ్మణ , క్షత్రియ , వైశ్య , శూద్ర , మ్లేచ్చ జాతులు కాదు అని మనమందరము తెలుసుకోవాలి .

ఎందుకంటే ఇప్పుడు ప్రపంచము లోనే అగ్రరాజ్యము అమెరికాను పరిపాలిస్తున్న  బరాక్ ఒబామా క్షతియుడు కాదు కదా. భారత దేశ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు క్షత్రియుడు కాదు కదా . ప్రపంచములో ఉన్న దేశ అధినేతలలో ఎందరు క్షత్రియులు ఉన్నారు ?.

షేర్ మార్కెట్ మాంత్రికుడు గా పేరు గాంచిన వారెన్ బఫెట్ , రాకేశ్ జంజిన్వాలా లాంటి అపర చాణుక్యులు, వ్యాపార సామ్రాజ్యాలకు అధిపతులు అయిన బిల్ గేట్స్ , ధీరూభాయ్ అంబానీ , ముఖేష్ అంబానీ , అనిల్ అంబానీ , ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నారాయణ మూర్తి , విప్రో అధినేత అజీం ప్రేమ్ జీ వంటి వ్యాపార దిగ్గజాలలో ఎంతమంది వైశ్యజాతి వారున్నారు .

దీనిని బట్టి మనము ఏమని గ్రహించాలి . గ్రహముల కు చెప్పబడిన జాతులు లక్షణములు తెలుసుకొనుటకే గానీ ఇప్పుడున్న కులములకు సంబంధించినవి కావని గ్రహించాలి . 

ఈనాడు రాజరికపు వ్యవస్థలు పోయాయి .. ప్రజాస్వామ్య వ్యవస్థలు వచ్చాయి .
వ్యవస్థలు మారవచ్చు . కులాలు మారవచ్చు . కానీ గ్రహాలు శాశ్వతం , భూమి, ఆకాశము శాశ్వతం . పంచ భూతములు శాశ్వతం . అందువలన మహర్షులు చెప్పిన ఏ విషయము అసత్యము కాదు . శాస్త్రములను శోధించి, మదించి మానవాళి అభివృద్ధి కొరకు మానవ పురోగతి కొరకు ఎన్నో పరిశోధనలను చేయాల్సిన అవసరం ఉంది .    

మరింత వివరణ తదుపరి శీర్షికలో .....................

మేషరాశి

ద్వాదశ రాశులను బట్టి మానవుని జీవిత విశేషములను , మానవుల యొక్క గుణ గణాలను తెలుసు కోవచ్చని జ్యోతిష్య శాస్త్రవేత్తలు తెల్పి యున్నారు . మ...